నరేష్ ‘ఉగ్రం’ రివ్యూ: ఉగ్రరూపం చూపించిన అల్లరోడు.. సినిమా ఎలా ఉందంటే..!!

టాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతమంది హీరోలు ఉన్నా అల్లరి నరేష్ కి ఉన్న క్రేజ్ ఫ్యాన్ ఫాలోయింగ్ ప్రత్యేకమైన చెప్పాలి . కామెడీ హీరోగా సినీ ఇండస్ట్రీలోకి అడుగు పెట్టి.. ఆ తర్వాత తనదైన స్టైల్ లో ఇండస్ట్రీలో సినిమాలు చేసి జనాలను మెప్పించాడు . ఒకానొక టైం లో స్టార్ హీరోలతో సినిమాలు తీసిన ఫ్లాప్ అవుతుందేమో కానీ అల్లరి నరేష్ సినిమాలు తీస్తే సూపర్ డూపర్ హిట్ అవ్వాల్సిందే అనంత స్థాయికి ఆయన పేరును సంపాదించుకున్నాడు.

Latest: Allari Naresh's Ugram locks its release date | 123telugu.com

కాగా గత కొంతకాలంగా హిట్లు పడని అల్లరి నరేష్ కి మంచి హిట్ ఇచ్చాడు కొయ్త్త దర్శకుడు విజయ్ కనమేడల. అల్లరోడి దగ్గర ఇంత టాలెంట్ ఉందా..? ఇన్ని షేడస్ ఉన్నాయా..? అంటూ..నాంది సినిమాలో నరేష్ లో దాగున్న టాలెంట్ చూపించాడు. కాగా ఆ సినిమా హిట్ అవ్వడంతో మరోసారి వీళ్ల కాంబో సెట్ చేసారు మేక్ర్స్.

రీసెంట్గా అల్లరి నరేష్ చేసిన “ఉగ్రం”. విజయ్ కనకమేడలా డైరెక్షన్ లో తెరకెక్కిన ఈ సినిమా కొన్ని గంటల క్రితమే బాక్స్ ఆఫీస్ వద్ద గ్రాండ్ గా ధియేటర్స్ రిలీజ్ అయ్యింది. ఫస్ట్ షోతోనే యావరేజ్ టాక్ సంపాదించుకుంది . దర్శకుడు విజయ్ కనకమెడలతో ఉన్న ఫ్రెండ్షిప్ కారణంగా ఆయనతో ఇదివరకే వర్క్ చేసిన ఎక్స్పీరియన్ కారణంగా నరేష్ ఈ సినిమాపై బోలెడు ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకున్నారు .

First Song From Allari Naresh's Ugram Out Now; Watch Here

కాగా నాంది సినిమాలు చేయని తప్పకు శిక్ష అనుభవించే అమాయకుడిగా కనిపించిన నరేష్ ఈ సినిమాలో ఓ పవర్ఫుల్ పోలీస్ అధికారిగా కనిపించి..అభిమానులను మెప్పించారు. ఇన్నాళ్లు సైలెంట్ గా కామెడీ రోల్స్ లో చూసే నరేష్ ని ఇలాంటి పాత్రలో మనం ఎప్పుడూ చూడలేదని చెప్పాలి . సినిమా మొత్తానికి కర్త – కర్మ – క్రియ అన్ని తానై పోషించాడు అల్లరి నరేష్ . సాఫీగా సాగిపోతున్న తన జీవితంలో తన కూతురు కిడ్నాప్ కావడంతో ఎలా మలుపు తిరిగింది అనేది మెయిన్ స్టోరి.

అయితే దర్శకుడు విజయ్ రాసుకున్న కధ బాగునా.. నరేష్ విజృంభించేసినా.. సరే కథని జనాలకి చూపించే విషయంలో డైరెక్టర్ ఫ్లాప్ అయ్యాడు అంటున్నారు జనాలు . ముఖ్యంగా ఫస్ట్ హాఫ్ చాలా సుత్తి కొట్టించిందని.. సినిమా ఏం బాలేదని..చాలా సాగ దీసాడు అని.. అసలు వర్కౌట్ కాలేదని చెప్తున్నారు . అంతేనా సినిమా స్టార్ట్ అయిన 20 నిమిషాల వరకు ఏం జరుగుతుందో తెలియక ధియేటర్ కి వెళ్లిన జనాలు తల బద్ధలు కొట్టుకుంటాడని చెప్పుతున్నారు.

Allari Naresh 'Ugram' locks a new release date

ఇంటర్వెల్ సీక్వెన్స్ బాగుంటుందని ..మ్యూజిక్ అనుకున్నంత మాయ చేయ లేకపోయిందనిచెప్పుతున్నారు . కూతురు కిడ్నాప్ అయ్యాక..అంతక ముందు కూడా కిడ్నాప్ అయ్యిన విషయాలు బయట పడుతాయి. అప్పుడు పోలీస్ ఆఫిసర్ అయిన నరేష్ ఆ మిస్టరీ ని ఎలా సాల్వ్ చేసాడు.. తన కూతురిని ఎందుకు కిడ్నాప్ చేశాడు..అన్నది మిగతా కధ.

సెకండ్ హాఫ్ లో మిస్టరీ.. ట్విస్టులు ..ధ్రిల్లింగ్ ఇన్వెస్టిగేషన్స్ ప్రేక్షకులకు ఊరట కలిగిస్తాయి .. ఓవర్ ఆల్ గా చూసుకుంటే “నాంది ” సినిమాతో హిట్ ట్రాక్ ఎక్కిన విజయ్ కనకమెడల – అల్లరి నరేష్.. రెండో సినిమాతో రెండోసారి కూడా హిట్ కొట్టాలి అని బోలెడు ఆశలు పెట్టుకున్నారు . కానీ అది తెర పై వర్క్ అవుట్ కాలేదు. పాపం చాలా ఏళ్ల తరువాత నరేష్ నటనా ఉగ్ర రూపం చూసిన..అభిమానులకు ఆ ఫీలింగ్ లేకుండా చేశాడు డైరెక్టర్ విజయ్ కనమేడల . చూద్దాం మరి ఫస్ట్ డే కలెక్షన్స్ ఏ విధంగా ఉంటాయో..?