మోక్షజ్ఞ ఎంట్రీకి.. ‘ అఖండ 2 ‘ కి ఇంత లింక్‌ ఉందా..?

నందమూరి నట‌సింహ బాలకృష్ణకి నట వారసుడిగా మోక్షజ్ఞ తెలుగు సినిమా ఇండస్ట్రీలకి త్వరలోనే అడుగు పెట‌బోతున్నాడ‌న్న వార్త‌లు ఎప్పటినుంచో వార్తలు వినిపిస్తున్నాయి. అయినా ఇప్పటివరకు అది జరగలేదు. మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులే కాక సినిమా వర్గాలు కూడా ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మోక్షజ్ఞ సినిమా ఎంట్రీ గురించి బాలకృష్ణ చాలా సార్లు స్పందించినా ఎప్పుడు ఎంట్రీ ఇస్తాడు అనే వార్త పై క్లారిటీ స‌రైన క్లారిటి ఇవ్వ‌లేదు.

Will Nandamuri Balakrishna's Son Mokshagna Teja Become a Big Star?  Astrologer Predicts

ఇటీవల మోక్షజ్ఞ అఖండ 2 సినిమాలో తండ్రి తో పాటు ఒక యంగ్ హీరో పాత్రలో నటించబోతున్నాడు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం రామ్ తో సినిమా తీస్తున్న బోయపాటి ఆ సినిమా పూర్తయిన వెంటనే అఖండ 2 సినిమా సెట్స్ మీద‌కు తీసుకువచ్చే ప్రయత్నంలో ఉన్నాడు. ఇప్పటికే ఈ సినిమా పోస్ట‌ర్ రిలీజ్ కావడంతో బాలకృష్ణ పర్మిషన్‌తో ఆ సినిమా ప్రి ప్రొడక్షన్ పనులు స్టార్ట్ చేయాలని చూస్తున్నాడట బోయపాటి.

AKHANDA 2 -Balakrishna Intro First Look Teaser|Akanda 2 Official  Teaser|Balakrishna|Boyapati|ThamanS - YouTube

ఈ కథలో బాలకృష్ణతో పాటు ఒక యంగ్ హీరో రోల్ కూడా ఉండడంతో ఆ పాత్రను మోక్షజ్ఞతో చేయిస్తే బాగుంటుందని బాలకృష్ణ ఆలోచిస్తున్నాడంటూ వార్తలు బయటకు వచ్చాయి. అయితే ఇప్పటికే మోక్షజ్ఞ బాలకృష్ణ నటించిన లెజెండ్ సినిమాలో.. ఆ తర్వాత నటించిన గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాలో తండ్రితో పాటు నటించబోతున్నట్టు వార్తలు వచ్చాయి. కానీ అవన్నీ పుకార్లే అని తెలిపాయి. దీంతో ఈ సినిమాలో అయినా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా.. లేదా..? అనేది సస్పెన్స్ గానే ఉంది.

వచ్చే సంవత్సరం జరగబోయే ఆంధ్రప్రదేశ్ ఎలక్షన్స్ కంటే ముందే ఈ మూవీ రిలీజ్ అవుతుంది అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. అంతేకాదు ఈ సినిమాలో పాలిటిక్స్ రిలేటెడ్ డైలాగ్స్ కూడా బాగానే ఉన్నాయంటూ వార్తలు విచ్చాయి. అఖండ 2 సినిమాలోనైనా మోక్షజ్ఞ ఎంట్రీ ఉంటుందా లేదా..? అనేది చూడాలి.