ప్లాష్‌బ్యాక్‌: డ‌బ్బు, పొగ‌రుతో క‌నిపించిన ప్ర‌తి ఆడ‌పిల్ల జీవితంతో ఆడుకున్న చిరంజీవి… !

ఈ టైటిల్ చూస్తే కాస్త చిత్రంగానే అనిపిస్తుంది.. చిరంజీవి ఏంటి ? డ‌బ్బు, పొగ‌రుతో క‌నిపించిన ప్ర‌తి ఆడ‌పిల్ల జీవితంతో ఆడుకోవ‌డం ఏంట‌న్న డౌట్ వ‌స్తుంది. ఆ చిరంజీవి ఎవ‌రో కాదు.. మెగాస్టార్ చిరంజీవే. అయితే అది ఎలాగో చూద్దాం. టాలీవుడ్‌లో టాలెంట్ ఉండి.. మంచి సినిమాలు తీసి కూడా అంత పాపుల‌ర్ అవ్వ‌ని ద‌ర్శ‌కులు చాలా మందే ఉన్నారు.

Kukka Katuku Cheppu Debba (1979) - IMDb

వీరిలో బంద‌రుకు చెందిన ఈరంకి శ‌ర్మ కూడా ఒక‌రు. ఆయ‌న‌ ద‌ర్శ‌క‌త్వంలో చిరు హీరోగా ఓ సినిమా తెర‌కెక్కింది. ఈ సినిమా అప్ప‌ట్లో ఎన్నో సంచ‌ల‌నాల‌కు కేంద్ర బిందువు అయ్యింది. చిరంజీవిలోని గొప్ప న‌టుడిని వెలికి తీసింది. ఆ సినిమా కుక్క కాటుకు చెప్పుదెబ్బ‌. ఈ సినిమాలో చిరంజీవి విల‌న్‌గా న‌టించాడు. డ‌బ్బులున్నాయ‌న్న అహంభావంతో చిరు ప్ర‌తి ఆడ‌పిల్ల జీవితంతోనూ చెల‌గాటం ఆడుతూ ఉంటాడు. ఆ సినిమాకు నిజ‌మైన విల‌న్ చిరంజీవే. అలా తాను పాడుచేసిన ఓ అమ్మాయి చేతిలోనే చిరు హ‌త‌మైపోతాడు.

ఆ పాత్ర‌లో చిరు అద్భుతంగా న‌టించాడు. అదే చిరంజీవిని ఉదాత్త పాత్ర‌లో చూపిస్తూ సీతాదేవి సినిమా తీశాడు శ‌ర్మ‌. సుజాత అన్న పాత్ర‌లో చిరంజీవి న‌టించాడు. కుక్క‌కాటుకు చెప్పుదెబ్బ సినిమాలో ఆ పాత్ర చిరుకు నిజంగానే మంచి పేరు తెచ్చిపెట్టింది. ఇక వీరంకి శ‌ర్మ తెలుగులో చేసింది త‌క్కువ సినిమాలే అయినా మంచి పేరు తెచ్చిపెట్టాయి.

PUNADHI RALLU | TELUGU FULL MOVIE | CHIRANJEEVI | SAVITRI | ROJARAMANI | V9  VIDEOS - YouTube

ప‌శ్చిమ‌గోదావ‌రి జిల్లాకు చెందిన సీనియ‌ర్ రాజ‌కీయ వేత్త‌, మాజీ మంత్రి చేగొండి హ‌రిబాబుతో ఆయ‌న‌కు ఏర్ప‌డిన ప‌రిచ‌యంతోనే ఆయ‌న‌కు ప‌లు సినిమాల‌కు డైరెక్ట్ చేసే ఛాన్స్ వ‌చ్చింది. చేగొండి హ‌రిబాబు నిర్మించిన మూడు, నాలుగు సినిమాల‌కు శ‌ర్మ ద‌ర్శ‌క‌త్వం వ‌హించారు. ఇక వంశీ డైరెక్ట్ చేసిన తొలి సినిమా మంచుప‌ల్లకి సినిమాకు ముందుగా శ‌ర్మ‌నే డైరెక్ట‌ర్ అనుకున్నారు. ఆ త‌ర్వాత ఆ ప్లేస్‌లోకి వంశీ వ‌చ్చి చేరాడు.