ఛార్మీ, పూరి చిరంజీవిని చూసి సిగ్గు తెచ్చుకోండి… సినిమా ఎలా తీస్తారో చూస్తామంటూ వార్నింగ్‌…!

డిజాస్ట‌ర్ లైగర్ వివాదం కొనసాగుతోంది. లైగర్ సినిమా కొన్న వాళ్లు అంద‌రూ నిండా మునిగిపోయారు. అస‌లు ఈ సినిమా హోల్‌సేల్ బ‌య్య‌ర్ వ‌రంగ‌ల్ శీను ఎక్క‌డున్నాడో ఏమైపోయాడో తెలియ‌ట్లేదు. ఇక ఎగ్జిబిట‌ర్లు, జిల్లాల వారీగా రైట్స్ కొన్న వాళ్లు కూడా కోట్ల‌లో మునిగిపోయారు. అస‌లు ఇప్ప‌ట్లో వీరు కోలుకునే ప‌రిస్థితి కూడా లేదు. వీరి న‌ష్టాలు తీరుస్తామ‌ని చెప్పిన పూరి జ‌గ‌న్నాథ్‌, నిర్మాత ఛార్మీ ఇప్పుడు రామ్‌తో ఇస్మార్ట్ శంక‌ర్‌కు సీక్వెల్ అంటూ మొద‌లు పెట్టేశారు.

Glimpse of LIGER | Vijay Deverakonda | Puri Jagannadh | Ananya Panday |  Karan Johar | 25th August - YouTube

మ‌రోవైపు లైగ‌ర్ సినిమా న‌ష్టాలు పూడ్చాలంటూ ఈ సినిమా కొన్న డిస్ట్రిబ్యూట‌ర్లు, ఎగ్జిబిట‌ర్లు నిర‌స‌న‌ల‌కు దిగుతున్నారు. ఏషియ‌న్ సునీల్ లాంటి వాళ్లు స‌ర్దిచెప్పే ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. మ‌రి కొంద‌రు అయితే ఏకంగా హీరో విజయ్ తీసుకున్న పారితోషకాన్ని వెనక్కి ఇవ్వాలని డిమాండ్ చేస్తుండ‌డం విచిత్రం. ఇందుకు వాళ్లంతా ఆచార్య సినిమా ఉదాహరణగా అని.. ఆ సినిమా ప్లాప్ అవ్వ‌డంతో చిరంజీవి, రామ్‌చ‌ర‌ణ్ ఇద్ద‌రూ కూడా త‌మ రెమ్యున‌రేష‌న్ వెన‌క్కు ఇచ్చి మ‌రీ న‌ష్టాలు భ‌ర్తీ చేశార‌ని చెపుతున్నారు.

Liger Movie Review Vijay Devarakonda Ananya Pandey Mike Tyson Starred Liger  Review Rating

ఎగ్జిబిట‌ర్లు, సినిమా కొన్నోళ్లు అయితే పూరి జ‌గ‌న్నాథ్‌కు, ఛార్మీకి సిగ్గు ఉంటే చిరంజీవిని చూసి అయినా నేర్చుకోవాల‌ని.. త‌మ న‌ష్టాలు భ‌ర్తీ చేయాల‌ని డిమాండ్లు చేస్తున్నారు. అయితే ఈ సినిమా కోసం విజ‌య్ చేయాల్సింది అంతా చేశాడు. రెమ్యున‌రేష‌న్ కాస్త త‌గ్గించుకున్నాడు. పైగా ప్ర‌మోష‌న్ల కోసం ఏకంగా నెల రోజులు కేటాయించాడు. చాలా క‌ష్ట‌ప‌డ్డాడు.

I'm still clueless about stardom: Vijay Deverakonda

ఇక ఛార్మీ, పూరి త‌మ న‌ష్టాలు భ‌ర్తీ చేయ‌కుండా అప్పుడే కొత్త సినిమా మొద‌లు పెడుతుండ‌డంతో నిర‌స‌న‌కు దిగినోళ్లంతా మీరు కొత్త సినిమా ఎలా ? తీస్తారంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. మీ సినిమాను ఎవ్వ‌రూ కొంటారో చూస్తామ‌ని… మీరు మాకు సెటిల్‌మెంట్ చేయ‌కుండా ముందుకు వెళితే చూస్తూ ఊరుకోమంటూ వార్నింగ్‌లు ఇస్తున్నారు. మ‌రి పూరి, ఛార్మీ లైగ‌ర్ బాధ‌ల‌ను ఎలా విముక్తి పొందుతారో ? చూడాలి.