ప‌విత్రా లోకేష్ ముద్దు పేరు చెప్పిన న‌రేష్‌… ఎంత చిలిపి ప‌ని చేశాడంటే…!

నటి పవిత్ర లోకేష్‌, సీనియర్‌ నటుడు వీకే నరేష్‌ చాలా కాలంగా ప్రేమించుకుంటున్న సంగ‌తి తెలిసిందే. వీరిద్ద‌రు చాలా రోజులుగా సహజీవనం చేస్తున్నారు. ప్రస్తుతం వీరిద్ద‌రు కలిసి `మళ్లీ పెళ్లి` సినిమా కూడా చేస్తుండ‌గా.. ఇది నరేష్ వివాహాలు, విడాకుల‌ కోణంలో తెరకెక్కుతుంది. ఈ నెలలోనే ఈ సినిమా రిలీజ్ కాబోతుంది. ఈ నేపథ్యంలో వరుసగా ప్రమోషన్స్ లో పాల్గొంటోన్న ఈ జంట అటు తమ రిలేషన్‌షిప్ కూడా జనాల్లోకి బాగా తీసుకెళ్తున్నారు.

ఇటు సినిమా కూడా ప్రమోట్‌ చేసుకుంటున్నారు. తాజాగా ఈ జంట ఓంకార్ టాక్ షో `సిక్త్స్ సెన్స్` వచ్చారు. ఈ షోలో ప‌లు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు. పవిత్రని ముద్దుగా ఏమని పిలుస్తారో చెప్పాల‌న‌గా నరేష్‌. ముద్దుగా తనని `అమ్ములు` అని పిలుచుకుంటాన‌ని …. ఇంకా ప్రేమ ఎక్కువైతే `అమ్ము` అని, ఇంకా ప్రేమ ఎక్కువైతే ఏమని పిలుస్తానో తెలుసా.. అని సస్పెన్స్ పెట్టి `వద్దులే` అని ట్విస్ట్ ఇచ్చాడు.

ఓంకార్ ప్రస్తుతం మీ రిలేషన్‌ షిప్‌ స్టేటస్‌ ఏంటని ప్ర‌శ్నిస్తే ఆకాశం మీద పడినా… భూమి బద్దలైనా కూడా తామిద్ద‌రం కలిసి ఉంటామని చెప్పాడు. ఇక‌ ఇద్దరు కలసి డాన్సులు చేయ‌డంతో పాటు కావాల్సినంత ర‌చ్చ చేస్తూ ఒకరికి ఒకరు ముద్దులు పెట్టుకుంటూ ముద్దుల వర్షం కురిపించుకున్నారు. ఇక తుపాకీ పెట్టి కాల్చే సీన్‌లో ఓంకార్‌ మాట నమ్ముతావా ? నా మాట నమ్ముతావా ? అని నరేష్‌ ప్రశ్నిస్తే మిమ్మ‌ల‌నే న‌మ్ముతాన‌ని ప‌విత్ర చెప్పింది. వెంట‌నే న‌రేష్ మ‌రో ఆప్ష‌న్ లేదు న‌మ్మాల్సిందే అని చెప్పాడు.

ఏదేమైనా ఈ ప్రోమో చూసిన వాళ్లంతా లేటు వ‌య‌స్సులో కూడా ఈ జంట ఇంత ఘాటు ప్రేమలో మునిగి తేలుతోంద‌ని .. ఒరేయ్ మీ రొమాన్స్ చూడ‌లేక చస్తున్నాం.. ఆపండ్రా బాబు అంటూ కామెంట్లు పెడుతున్నారు సోష‌ల్ మీడియాలో..! మ‌రి కొంద‌రు మాత్రం వాళ్ల ఇష్టం వాళ్ల‌ది అంటూ స‌పోర్ట్ చేస్తున్నారు.