మంచు ల‌క్ష్మి అందుకే త‌న భ‌ర్త‌తో క‌లిసి ఉండ‌డం లేదా ?

ప్రపంచం ఎలా ఉన్నా ఎవరు ఏమనుకున్నా మాకు నచ్చినట్టు మేము ఉంటాము అనే ధోర‌ణితో ఉంటారు సెలబ్రిటీలు. ముఖ్యంగా సినిమా సెలబ్రిటీలు అయితే తమకు ఇష్టం వచ్చినట్టు జీవిస్తూ ఉంటారు. ఎవరు ఎప్పుడు ఎవరితో ? కలిసి ఉంటారు ఎప్పుడు విడిపోతారు తిరిగి ఎవరితో కలుస్తారో ? ఎవరికి అర్థం కాదు. ఇక టాలీవుడ్ లో సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు కుటుంబం ఎప్పుడూ ఏదో ఒక రూపంలో వార్తల్లో ఉంటూ వస్తుంది. గత మూడు నాలుగు సంవత్సరాలుగా మోహన్ బాబు కుటుంబం పై తీవ్రమైన నెగెటివ్ టాక్ తో పాటు భారీ ఎత్తున ట్రోలింగ్ జరుగుతోంది. అయినా వారు ఎవరు అవి పట్టించుకోరు.

Did you know that Manchu Lakshmi had planned to runaway from her own  wedding? Here's why - IBTimes India

ఇటీవల మోహన్ బాబు రెండో కుమారుడు మనోజ్ తన ప్రియురాలు భూమా మౌనిక రెడ్డిని రెండో వివాహం చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ పెళ్లిలో అంతా తానే నడిపించింది మోహన్ బాబు కుమార్తె మంచు లక్ష్మి. ఇక మంచు లక్ష్మి యాటిట్యూడ్ ఎప్పుడు డిఫరెంట్ గా ఉంటుంది. ఆమె వేష‌.. భాషతో పాటు అమెరికన్ ఇంగ్లీష్ భారీ ఎత్తున ట్రోలింగ్‌కు గురవుతూ ఉంటుంది. ఇక మంచు లక్ష్మి వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే మాండి శ్రీనివాసన్ అనే చెన్నైకు చెందిన ఓ వ్యక్తిని ఆమె ప్రేమ వివాహం చేసుకున్నారు.

అయితే మంచు లక్ష్మి ఎక్కడికి వెళ్ళినా ఒంటరిగానే వెళుతూ ఉంటుంది. ఆమె భర్తతో కలిసి కనిపించడం అరుదు. ఇంకా చెప్పాలంటే మంచు లక్ష్మి భర్తతో కలిసి కనిపించిన సందర్భాలు ఎప్పుడు లేవు. దీనిపై తన తాజా ఇంటర్వ్యూలో ఆమె క్లారిటీ ఇచ్చింది. కొందరు అయితే మంచు లక్ష్మి కూడా భర్తకు విడాకులు ఇచ్చేసిందా ? అన్న పుకార్లు కూడా లేపారు. దీనిపై ఆమె మాట్లాడుతూ సోషల్ మీడియాలో వచ్చే వార్తలను తాను కూడా గమనిస్తూనే ఉంటాను.. ఈ వార్త కూడా నా దృష్టికి వచ్చిందూని క్లారిటీ ఇచ్చింది.

నా భర్త అమెరికాలో సాఫ్ట్వేర్ ఉద్యోగి.. అక్కడ ఆయన చాలా సంవత్సరాల నుంచి పని చేస్తున్నారు. ఒకసారి నేను లాస్ ఏంజిల్స్ వెళ్ళినప్పుడు నా చేతిలో ఒక్క రూపాయి కూడా లేదు.. చదువుకునే రోజుల్లో నేను ఉద్యోగాలు చేసి డబ్బు కూడ‌పెట్టే దానిని.. కానీ నేను లాస్ ఏంజిల్స్ లో ఉండడంతో సంపాదన ఉండేది కాదు.. ఈ విషయాన్ని నేను ఆయనతో చెప్తే నీకు ఏది అనిపిస్తే అది చెయ్యి అని స‌ల‌హా ఇచ్చార‌ట‌.

నీ వృత్తి సినిమా కాబట్టి నీకు అది అత్యవసరం.. నువ్వు సంతోషంగా ఇండియాకి వెళ్లి సినిమాలు చేసుకో.. ఖాళీ సమయంలో ఇక్కడికి రా అని చెప్పార‌ట‌. మా ఇద్దరి మధ్య అంత ఫ్రీడమ్ ఉంటుంది అని మంచు లక్ష్మి చెప్పుకొచ్చింది. సో దీనిని బట్టి చూస్తే మంచు లక్ష్మి భర్త అమెరికాలో ఉంటున్నట్టు అర్థమవుతుంది.