ఆ యంగ్ హీరో డిజాస్ట‌ర్ టైటిలే ప‌వ‌న్ – సాయితేజ్‌కు గ‌తి అయ్యిందా… ఇదేం తిక్క‌రా సామీ..!

పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ – సాయి ధరంతేజ్ క‌లిసి ఒక మల్టీ స్టార్ మూవీలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. సాయిధరం తేజ్ భ‌క్తుడిగా, ప‌వ‌న్ క‌ళ్యాణ్ దేవుడిగా న‌టించే ఈ సినిమాకు త‌మిళ సీనియ‌ర్ న‌టుడు, ద‌ర్శ‌కుడు సముద్రఖని డైరెక్టర్ గా వ్యవహరిస్తున్నాడు. యంగ్ బ్యూటీ కేతిక శర్మ హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమా పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీ.. జి స్టూడియోస్ బ్యానర్ పై టీజీ విశ్వప్రసాద్ నిర్మాణంలో తెర‌కెక్కుతోంది.

BRO Motion Poster: Pawan Kalyan's Mass Swag - TeluguBulletin.com

ఇప్పటికే పవన్ కళ్యాణ్ – సాయి ధరమ్ తేజ్ క‌లిసున్న ఓ పోస్టర్ రిలీజ్ అయి నిన్న మొన్నటి వరకు వైరల్ అవుతూనే ఉంది. సాయి కుర్చీలో కూర్చుంటే ప‌వ‌న్ స్టాండింగ్ పొజిష‌న్‌లో సాయిపై చేయి వేసుకుని ఉన్న లుక్ అదిరిపోయింది. ఇక మెగా హీరోస్ మల్టీ స్టారర్ కావడంతో ఈ సినిమాపై ప్రేక్షకుల్లో అంచనాలు చాలా ఎక్కువగానే ఉన్నాయి.

ఈ సినిమాకు నిన్న బ్రో అనే టైటిల్ అనౌన్స్ చేశారు. బ్రో అనే టైటిల్ తో నిన్న రిలీజ్ అయిన మోషన్ పోస్టర్‌కు హ్యూజ్ రెస్పాన్స్ వ‌చ్చింది. పవన్ ఫస్ట్ లుక్ అదిరిపోయింది అంటూ.. థ‌మన్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ స్పెషల్ అట్రాక్షన్ గా ఉందంటూ సోష‌ల్ మీడియా హోరెత్తుతోంది. కాగా మెగా ఫాన్స్ కు మాత్రం ఈ టైటిల్ నిరాశను మిగిల్చింది.

Streaming Updates on Twitter: "Telugu film #Bro will premiere on SonyLIV on  November 26th. Starring Naveen Chandra and Avika Gor. Trailer:  https://t.co/preVHFvXZC https://t.co/DBGRJ4NWNk" / Twitter

ఈ టైటిల్‌తో గ‌తంలోనే హీరో నవీన్‌చంద్ర అన్నయ్య పాత్రలో అవికా గోర్ చెల్లెలుగా అన్నచెల్లెల అనుబంధం నేపథ్యంలో బ్రో టైటిల్ తో ఒక మూవీ వ‌చ్చింది. ఆ సినిమా సక్సెస్ అవ్వ‌లేదు. ఇప్పుడు అదే ప్లాప్ మూవీ టైటిల్ తో పవన్ కళ్యాణ్ – సాయితేజ్ మ‌ల్టీస్టార‌ర్ మూవీ వస్తుండ‌డం ప‌వ‌న్ ఫ్యాన్స్‌కే న‌చ్చ‌ట్లేదు. మరి కొంద‌రు నెటిజ‌న్లు ఆ ప్లాప్ హీరో డిజాస్టర్ టైటిల్.. పవన్ – సాయి తేజ్‌కు పెట్టారా ? ఇదేం తిక్క‌రా అని సెటైర్లు వేస్తున్నారు.