బిచ్చ‌గాడు 2 రివ్యూ… ఆ మ్యాజిక్ మాయ చేసిందా.. మిస్ అయ్యిందా…!

త‌మిళ హీరో, మ్యూజిక్ డైరెక్ట‌ర్ అయిన విజ‌య్ ఆంటోనీ బిచ్చ‌గాడు సినిమాతో తెలుగు ప్రేక్ష‌కుల‌కు బాగా ద‌గ్గ‌ర‌య్యారు. ఇంకా చెప్పాలంటే బిచ్చ‌గాడు సినిమా త‌మిళ్ కంటే తెలుగులోనే బాగా ఆడింది. ఎలాంటి అంచ‌నాలు లేకుండా వ‌చ్చి ఈ సినిమా 55 కేంద్రాల్లో 100 రోజులు ఆడింది. నిర్మాత చ‌ద‌ల‌వాడ శ్రీనివాస‌రావుకు భారీ లాభాలు తెచ్చిపెట్టింది. అస‌లు అప్ప‌ట్లో టాలీవుడ్ బిచ్చ‌గాడు మానియా నుంచి బ‌య‌ట‌కు వ‌చ్చేందుకు ఏకంగా యేడాదికి పైగానే ప‌ట్టింది అంటే ఆ సినిమా ఎంత సంచ‌ల‌న విజ‌యం సాధించిందో అర్థ‌మ‌వుతోంది.

Bichagadu 2 Review | Bichagadu 2 movie Review | Bichagadu 2 Telugu movie Review – Filmiforest

ఇక బిచ్చ‌గాడు వ‌చ్చిన ఇన్నేళ్ల‌కు ఇప్పుడు బిచ్చ‌గాడు 2 వ‌చ్చింది. పైగా ఈ సినిమా షూటింగ్‌లో తీవ్రంగా గాయ‌ప‌డ్డ హీరో విజ‌య్ ప్రాణాపాయ స్థితినుంచి బ‌య‌ట‌ప‌డ్డాడు. ఇప్ప‌టికే ఈ సినిమా ప్రీమియ‌ర్ షోలు కూడా కంప్లీట్ అయ్యాయి. బిచ్చ‌గాడు సినిమాలో త‌ల్లిని కాపాడుకునే కొడుకు పాత్ర‌లో మెప్పించిన విజ‌య్‌… ఈ సినిమాలో గురుమూర్తి, స‌త్య అనే రెండు పాత్ర‌ల్లో క‌నిపించారు. ఇక ప్లాష్‌బ్యాక్‌లో అన్నాచెల్లి సెంటిమెంట్ బాగా పండింద‌ని చెపుతున్నారు.

ఈ స్టోరీలో బిక్షం ఎత్తుకునే పిల్ల‌ల‌ను కిడ్నాప్ చేసే కొంద‌రు మాఫియా ముఠావాళ్లు, బ‌డా వ్య‌క్తులు వారితో ఏం చేయిస్తున్నార‌నే స్టోరీని తెర‌పై చ‌క్క‌గా ప్ర‌జెంట్ చేసిన‌ట్టు చెపుతున్నారు. ఇది సీక్వెల్ కాదు.. స‌ప‌రేట్ కొత్త స్టోరీ అయినా కూడా టైటిల్ చ‌క్క‌గా యాఫ్ట్ అయ్యిందంటున్నారు. అయితే స్క్రీన్ ప్లే డ‌ల్‌గా ఉంద‌ని… ఎమోష‌న‌ల్‌గా కూడా కొన్ని చోట్ల క‌నెక్ట్ కాలేదంటున్నారు. యాంటీ బికిలీ ఐడియా బాగున్నా ఎగ్జిగ్యూష‌న్‌లో ఫెయిల్ అయ్యార‌నే ఎక్కువ కామెంట్లు వ‌స్తున్నాయి.

BICHAGADU 2 - Vijay Antony Intro First Look Teaser|Bichagadu 2 Official  Teaser|VijayAntony|Muragadas - YouTube

 

సినిమా మొత్తం మీద ఒక‌టి, రెండు సీన్లే ఇంట్ర‌స్టింగ్‌గా ఉన్నాయ‌ని కొంద‌రు చెపుతున్నారు. ఫ‌స్టాఫ్‌లో సత్య స్లమ్ లైఫ్, గురుమూర్తి బిలియనీర్ లైఫ్ సీన్లు ఎంగేజింగ్‌గా ఉన్నాయి. ఇక నిర్మాణ విలువ‌లు, బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ అదిరిపోయాయంటున్నారు. ఓవ‌రాల్‌గా టేకాఫ్ బాగున్నా… సినిమా ముందుకు వెళుతున్న కొద్ది ప్లాట్‌గా ఉంద‌ట‌. ఫ‌స్టాఫ్‌లో ఇంట‌ర్వెల్ ట్విస్ట్ అదిరిపోయింద‌ని… ఆ త‌ర్వాత రొటీన్ ఫార్ములాతోనే ముందుకు వెళుతుంద‌ని చెపుతున్నారు.

సెకండాఫ్‌లో రొటీన్ రెగ్యుల‌ర్ క‌మ‌ర్షియ‌ల్ ఫార్మాట్‌తో క‌థ న‌డిపించేశాడ‌ని… సెకండాఫ్ స్టార్ట్ అయిన 5 నిమిషాల‌కే నెక్ట్స్ ఏం జ‌రుగుతుందో ? సులువుగా అంచ‌నా వేసేయ‌వ‌చ్చంటున్నారు. మ‌రీ బిచ్చ‌గాడు మ్యాజిక్ అయితే క్రియేట్ చేయ‌లేద‌ని.. ఈ వారం పెద్ద సినిమాలు లేక‌పోవ‌డంతో ఓ లుక్ వేస్తే వేయ‌వ‌చ్చ‌ని.. పెద్ద అంచ‌నాలు పెట్టుకోవ‌క్క‌ర్లేద‌నే అంటున్నారు.