భర్తతో విడాకులు తీసుకోవాలనుకున్న భూమికకు వార్నింగ్ ఇచ్చిన స్టార్ హీరో…?

సీనియర్ హీరోయిన్ భూమిక అంటే తెలియని వారు ఎవరూ ఉండరు. తన నటనతో తన అంద చందాలతో దాదాపు సౌత్ ఇండియాలోనే అన్ని భాషల్లో నటించి మెప్పించింది. భూమిక ముందుగా తన కెరీర్‌ను సీరియల్స్ లో మొదలుపెట్టి ఆ తర్వాత అక్కినేని హీరో సుమంత్‌ హీరో గో వ‌చ్చిన‌ యువకుడు సినిమాతో హీరోయిన్‌గా తెలుగులో అడుగుపెట్టింది. ఆ సినిమా తర్వాత స్టార్ హీరోలతో నటించి బ్యాక్ టు బ్యాక్ విజయాలను అందుకుని స్టార్ హీరోయిన్ గా మారింది.

అలా టాలీవుడ్ లోనే స్టార్ హీరోయిన్‌గా మారిన భూమిక తర్వాత బాలీవుడ్ లో కూడా అవకాశం రావడంతో అక్కడ కూడా సల్మాన్ ఖాన్, అభిషేక్ బచ్చన్ వంటి హీరోలతో కలిసి నటించింది. తర్వాత టాలీవుడ్ లో ఈమెకు అంతగా అవకాశాలు రాలేదు. ఆ సమయంలో దాంతో కొన్ని రోజులు డిప్రెషన్ లోకి వెళ్లిన భూమిక తర్వాత సెలబ్రిటీల యోగ టీచర్ భరత్ ఠాకూర్‌కు దగ్గరై ప్రేమలో పడి అతడిని పెళ్లి చేసుకుంది.

పెళ్లి తర్వాత సినిమాలకు కొంతకాలం దూరంగా ఉన్న ఈ ముద్దుగుమ్మ భర్తను ఒప్పించి ఎలాగైనా సినిమాలను ప్రొడ్యూస్ చేయాలని భావించిందట. కానీ భర్త ఠాకూర్ మన ఆర్థిక పరిస్థితి అంతగా బాగోలేదు అని చెప్పినా వినుకుండా భూమిక భ‌ర్త‌ను హైదరాబాద్ తీసుకువచ్చిందట. అలా భూమిక ఓ సినిమాను నిర్మించినా ఆ సినిమా బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ అవటంతో ఆమె పెట్టిన డబ్బు మొత్తం పోయింది.

దాంతో భరత ఠాకూర్- భూమిక మధ్య గొడవలు మొదలయ్యాయి. ఆ సమయంలోనే భరత్ ఠాగూర్ మరో అమ్మాయితో అక్రమ సంబంధం పెట్టుకున్నాడని తెలిసిన భూమిక ఎలాగైనా భర్త నుంచి విడాకులు తీసుకోవాలని భావించింద‌ట‌. అయితే ఇదే విషయాన్ని తెలుసుకున్న టాలీవుడ్ హీరో అక్కినేని నాగార్జున వీరిద్దరి మధ్య గొడవలను సరిచేసి విడాకులు తీసుకోవాలనే వీరి ఆలోచనను మైండ్ నుంచి తొలగించాడు.

నాగార్జున కారణంగా భూమిక తన భర్తతో విడాకులు తీసుకోకుండా తిరిగి కలిసి ముంబాయి వెళ్లి మళ్లీ తన భర్త సహాయంతో కొన్ని సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా చేస్తుంది. నాగార్జున – భూమిక జంట‌గా స్నేహ‌మంటే ఇదేరా సినిమాలో కూడా న‌టించారు. ఇలా ప్రస్తుతం టాలీవుడ్ లోనే వరుస సినిమాలు చేసుకుంటూ భూమిక బిజీగా ఉంది.