బాలయ్యతో స్పెషల్ సాంగ్ నుంచి త‌మ‌న్నాను త‌ప్పించేశారా… ఆ కార‌ణంతోనే అన‌సూయ ఫిక్స్‌..!

అఖండ, వీర సింహారెడ్డి సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ విజ‌య‌ల‌ను తన ఖాతాలో వేసుకుని ఫుల్ జోష్ లో ఉన్న నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం సక్సెస్‌పుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి తో తన 108వ సినిమా చేస్తున్నాడు. ఇప్పటికే చాలా వరకు షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ సినిమాలో బాలయ్యకు జంటగా కాజల్ అగర్వాల్ హీరోయిన్‌గా నటిస్తుంది.

NBK 108: Powerful first look posters of Balakrishna released | 123telugu.com

యంగ్ సెన్సేషన్ శ్రీ లీల, బాలీవుడ్ స్టార్ నటుడు అర్జున్ రామ్ పాల్ వంటి అగ్ర నటులు ఈ సినిమాలో కీలకపాత్రలో నటిస్తున్నారు. షైన్ స్క్రీన్ బ్యానర్ పై సాహూ గారపాటి, హరీష్ పెద్ది నిర్మిస్తున్న ఈ సినిమాకి థ‌మన్ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే దసరా కానుకగా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఈ సినిమాలో ఓ స్పెషల్ సాంగ్ ఉంది. ఇప్పుడు ఈ సాంగ్ కోసం మిల్కీబ్యూటీ త‌మ‌న్నాతో ద‌ర్శ‌కుడు అనిల్ రావిపూడి సంప్ర‌దింపులు జ‌రుపుతున్న‌ట్టు వార్త‌లు వ‌చ్చాయి.

Balakrishna: Latest News, Videos and Photos of Balakrishna | The Hans India  - Page 1

అయితే లేటెస్ట్ బ‌జ్ ప్ర‌కారం త‌మ‌న్నా కాకుండా ఈ సాంగ్‌లో జబర్దస్త్ మాజీ యాంకర్ హాటీ అనసూయని రంగంలోకి దించాలని నిర్ణయించుకున్నట్లుగా తెలుస్తోంది. అన‌సూయ ఇప్ప‌ట‌కే వ‌రుస సినిమాల‌తో బిజీగా ఉంది. ఇక ఇప్పుడు బాల‌య్య‌తో జ‌త క‌ట్ట‌డం అంటే అన‌సూయ‌కు అది గోల్డెన్ ఛాన్సే. అన‌సూయ గ‌తంలో సాయిధ‌ర‌మ్ తేజ్ విన్న‌ర్ సినిమాలోనూ ఐటెం సాంగ్ చేసింది.

Balakrishna – Anasuya : Anasuya along with Balayya.. This is the opinion of  Nandamuri fans? » Jstimesnow

ఇక ఈ ఐటెం సాంగ్ ఈ సినిమాకే చాలా ప్రత్యేకంగా ఉంటుందట‌. బాలకృష్ణ – అనసూయ ఐటెం సాంగ్ ఏ రేంజ్ లో ఉంటుందో ఊహించుకోవచ్చు. కోటి రూపాయల ఖర్చు పెట్టి తమన్నాని తీసుకొచ్చే బదులు తక్కువ ఖర్చుతో అనసూయతో చేసి. సాంగ్‌కు పబ్లిసిటీ భారీగా చేస్తే అంతకు మించి క్రేజ్ దక్కే అవకాశం ఉంద‌ని దర్శకుడు అనిల్ రావిపూడి భావించినట్లుగా తెలుస్తుంది. అందుకే అనసూయని రంగంలోకి దించబోతున్నాడ‌ట‌. ఈ సాంగ్‌లో అనుసూయ బాల‌య్య‌తో ఎలా స్టెప్పులు వేస్తుందో ? చూడాలి.