అక్క‌డ టీడీపీని బాబు వ‌దిలేశారా…. ఆ మంత్రి మ‌ళ్లీ గెలిచేస్తాడా…?

అవును ఏపీలో ఓ మంత్రిని పనిగట్టుకుని టీడీపీనే గెలిపించేలా ఉంది. ఆ మంత్రిపై వ్యతిరేకత ఉన్నా సరే దాన్ని ఉపయోగించుకోలేని స్తితిలో టీడీపీ ఉంది. దీంతో అక్కడ టి‌డి‌పి వీక్ గా ఉండటమే మంత్రికి ప్లస్. అలా టీడీపీ వీక్ గా ఉన్న స్థానం ఏదో కాదు..ఉమ్మడి తూర్పు గోదావరి జిల్లాలోని రామచంద్రాపురం స్థానం. ఇక్కడ టి‌డి‌పికి సరైన నాయకుడే కనిపించడం లేదు. తూర్పు గోదావరి లో ప్రతి నియోజకవర్గంలో టి‌డి‌పి యాక్టివ్ గానే ఉంది. ఆఖరికి వైసీపీ కంచుకోటగా ఉన్న రంపచోడవరంలో కూడా కొద్దో గొప్పో పార్టీ కార్యక్రమాలు జరుగుతున్నాయి.

 

కానీ రామచంద్రాపురంలో అలాంటివి పెద్దగా కనిపించడం లేదు. ఉండటానికి రెడ్డి సుబ్రహ్మణ్యం టి‌డి‌పి ఇంచార్జ్ గా ఉన్నారు..అయినా సరే అక్కడ టి‌డి‌పిని బలోపేతం చేయడంలో విఫలమవుతున్నారు. దీంతో ఇక్కడ వైసీపీకి అడ్వాంటేజ్ అవుతుంది. ఇక్కడ వైసీపీ నుంచి మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. జగన్ గాలిలో గత ఎన్నికల్లో చెల్లుబోయిన టి‌డి‌పి నుంచి పోటీ చేసిన తోట త్రిమూర్తులుపై 5 వేల ఓట్ల మెజారిటీతో గెలిచారు.

ఆ తర్వాత మంత్రివర్గంలో ఛాన్స్ కొట్టేశారు. మంత్రిగా గొప్ప పనితీరు ఏమి లేదు. ఏదో తూర్పు గోదావరి వాళ్ళకు తప్ప ఈయన మంత్రి అని రాష్ట్రం మొత్తం పెద్దగా తెలియదనే చెప్పాలి. మంత్రిగా నియోజకవర్గంలో చేసే అభివృద్ధి పెద్దగా లేదు. దీంతో మంత్రికి పెద్ద పాజిటివ్ లేదు. అయితే తోట త్రిమూర్తులు వైసీపీకి వెళ్లిపోయారు.

Thota Trimurthulu - Latest News in Telugu, Photos, Videos, Today Telugu  News on Thota Trimurthulu | Sakshi

ఆయన మండపేట బాధ్యతలు చూసుకుంటున్నారు. అయినా రామచంద్రాపురంలో ఉండే తోట వర్గం..చెల్లుబోయినకు యాంటీగా ఉంది..అయినా సరే..అక్కడ టి‌డి‌పి బలపడటంలో విఫలమవుతుంది. ఇక వచ్చే ఎన్నికల్లో ఇక్కడ టి‌డి‌పి గెలిచే ఛాన్స్ లేదు. ఒకవేళ..జనసేనతో పొత్తు ఉంటే ఏమైనా సీన్ మారుతుందేమో గాని..లేదంటే ఇక్కడ వైసీపీని టి‌డి‌పి గెలిపించనుంది.