జ‌గ‌న్‌కు ప‌వ‌న్ మార్క్ షాక్‌… జ‌న‌సేన‌లోకి వైసీపీ ఎమ్మెల్యే….!

వైసీపీలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో టికెట్ ద‌క్క‌ద‌ని భావిస్తున్న‌వారు వారి దారి వారు చూసుకుంటున్నారు. నిజానికి ఈ విష‌యంలో పార్టీ అధిష్టానం.. ముందుగానే ఒక హెచ్చ‌రిక చేసి.. చేతులు కాల్చుకుంద‌నే అభిప్రాయం వ్య‌క్త మ‌వుతోంది. ఎవ‌రూ కూడా ఏ పార్టీలోనూ ముందుగానే టికెట్లు ఇవ్వ‌బోమ‌ని చెప్ప‌రు.. అంతా ఆచి తూచి..చివ‌రి నిముషంలో తేలుస్తారు. త‌ద్వారా రెబ‌ల్స్ త‌గ్గుతార‌ని లెక్క‌వేసుకుంటారు. కానీ, వైసీపీలో చిత్రంగా దీనికి విరుద్ధంగా జ‌రిగింది.

YSRCP MLA Varaprasad terribly insulted..? - TeluguBulletin.com

వైసీపీ అధిష్టానం మంచి చెప్పిందో.. చెడు చెప్పిందో.. త‌న గ్రాఫ్‌ను స‌రిచేసుకునేందుకు ప్ర‌య‌త్నించ‌ని కొంద‌రు ఎమ్మెల్యేలు ఇప్ప‌టి నుంచి పొరుగు పార్టీల‌తో ట‌చ్‌లోకి వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ బాట‌లో గూడూరు వైసీపీ ఎమ్మెల్యే వ‌ర‌ప్ర‌సాద్ కూడా ఉన్న‌ట్టు పార్టీ కి తెలిసింది. వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఆయ‌న‌కు టికెట్ ఇచ్చేది లేద‌ని జ‌గ‌న్ గ‌తంలో చేసిన స‌మీక్ష‌లో అంద‌రి ముందుగానే వ్యాఖ్యానించారు. దీనిని అవ‌మానంగా భావించిన వ‌ర‌ప్ర‌సాద్ అప్ప‌టి నుంచి త‌న ప్ర‌య‌త్నాలు చేస్తున్నార‌ట‌.

జ‌న‌సేన‌తో ఆయ‌న ట‌చ్‌లో ఉన్నార‌ని వైసీపీ వ‌ర్గాల్లో చ‌ర్చ‌సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. మ‌ద్రాస్‌లో క‌లెక్ట‌ర్ గా, ప్ర‌భుత్వ ప్ర‌ధాన కార్య‌ద‌ర్శిగా చేసిన వ‌ర‌ప్ర‌సాద్‌కు అక్క‌డి కీల‌క నాయ‌కులు, సినీ వ‌ర్గాల‌తోనూ మంచి ప‌రిచ‌యాలు ఉన్నాయి. ఈ క్ర‌మంలో ఆయ‌న చిరంజీవి ద్వారా జ‌న‌సేన‌లో టికెట్ కోసం ప్ర‌య‌త్నిస్తున్నా రని వైసీపీవ‌ర్గాల్లో గుస‌గుసి వినిపిస్తోంది. దీనికి ద‌న్నుగా .. ఇటీవ‌ల ప‌వ‌న్‌తో ఉన్న ఫ్లెక్సీలో వ‌ర‌ప్ర‌సాద్ ఫొటో క‌నిపించింది. దీనిపై పెద్ద ఎత్తున ర‌గ‌డ చోటు చేసుకుంది.

Jana Sena Logo and symbol, meaning, history, PNG, brand

అయితే.. ఈ విష‌యంలో ఇటు పార్టీ కానీ అటు ఎమ్మెల్యే కానీ రియాక్ట్ కాలేదు. మ‌రోవైపు పార్టీ కూడా తాము ఎలానూ టికెట్ ఇచ్చేది లేద‌ని ప్ర‌క‌టించిన త‌ర్వాత వారి గురించి స్పందించాల్సిన అవ‌స‌రం లేద‌న్న‌ట్టు గా ఉంది. మ‌రోవైపు వ‌ర‌ప్ర‌సాద్ కూడా అప్ప‌టి వ‌ర‌కు బాగానే ఉన్నా.. త‌ర్వాత గ‌డ‌ప‌గ‌డ‌ప‌కు కార్య‌క్ర‌మాన్ని ప‌క్క‌న పెట్టారు. ప్ర‌స్తుతం పూర్త‌యిన స్టిక్క‌ర్ల కార్య‌క్ర‌మానికి కూడా ఆయ‌న అందుబాటులో లేకుండా పోవ‌డం గ‌మ‌నార్హం. మొత్తంగా చూస్తే.. టికెట్ ఇస్తారో ఇవ్వ‌రో తెలియ‌దు కానీ.. వ‌ర‌ప్ర‌సాద్ మాత్రం జ‌న‌సేన గూటికి చేర‌డం ఖాయమ‌నే అంటున్నారు.