ఏఎన్ఆర్ కండీష‌న్లు పెట్టి మ‌రీ సావిత్రి జీవితం నాశ‌నం చేశాడా…!

అప్పట్లో స్టార్ హీరోలుగా ఉన్న ఎన్టీఆర్, ఏఎన్నార్ విషయంలో సినిమా ఇండస్ట్రీలో చాలా గుసగుసలే వినిపించేవి. అయితే ఎన్టీఆర్ ఏదైనా చేస్తే అది పైకి కనిపించేది అని.. ఏఎన్ఆర్ ఏం చేసినా చాలా సైలెంట్ గా ఉండేదని.. వారిద్దరి గురించి తెలిసినవారు చెప్పే మాట. ఎన్టీఆర్ చేసే పనులు ఆయన ఎవరి మీద అయినా కోపం వ్యక్తం చేస్తే అది ఓపెన్ గా ఉండేది. కానీ ఏఎన్నార్ చాలా సైలెంట్ గా పని చేస్తారని టాక్ ఉంది.

N.T.R And Savitri Super Hit Songs - Volga Videos 2018 - YouTube

హీరోయిన్ల విషయంలో ఏఎన్ఆర్ చాలా ప్లానింగ్ తో ఉండేవారట. అప్పట్లో స్టార్ హీరోయిన్లుగా ఉన్నవారు అందరూ ఏఎన్ఆర్ తో కలిసి నటించారు. ముఖ్యంగా మహానటి సావిత్రిని ఏకంగా నాలుగేళ్ల పాటు తన సినిమాలలోనే నటించేలా దర్శక, నిర్మాతలపై ఒత్తిడి చేసి మరి డేట్లు బ్లాక్ చేయించారట. దీంతో ఆమె ఇత‌ర స్టార్ హీరోల సినిమాల్లో న‌టించేందుకు వీలు లేకుండా పోయింది.

సావిత్రి కెరీర్ ప‌రంగా వెన‌క‌ప‌డిపోవ‌డానికి గ‌ల కార‌ణాల‌లో ఇది కూడా ఒక‌టి అని చాలా మంది అంటూ ఉంటారు. దీంతో మిగిలిన స్టార్ హీరోల‌లో న‌టించేందుకు ఛాన్స్ లేకుండా పోయింది. ఇది మిగిలిన హీరోలు ఆమెపై తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేయ‌డానికి.. వారు ఆమెకు దూరం కావ‌డానికి కూడా కార‌ణ‌మైందంటారు.

Kannanukku Ethanai | Vettaikaran | MGR,Savitri | Tamil Movie Hit Song HD -  YouTube

తెలుగులో ఏఎన్నార్‌, పైగా ఆయ‌న ప‌ర్మిష‌న్‌తోనే త‌మిళ్‌లో అప్పుడ‌ప్పుడు శివాజీ గ‌ణేష‌న్‌తో ఒక‌టి రెండు సినిమాలు చేసేవార‌ట‌. దీంతో అటు ఎంజీఆర్, తెలుగులో ఎన్టీఆర్ లాంటి స్టార్ హీరోలు సావిత్రి అంటే అగ్గిమీద గుగ్గిలం అయిపోయేవార‌ట‌. అలా ఏఎన్నార్ సావిత్రికి చాలా కండీష‌న్లు పెట్ట‌డంతో పాటు ఆమె ఏఎన్నార్‌ను పిచ్చిగా ప్రేమిస్తోన్న అంశం ఇలా వాడుకుని.. ఆమె కెరీర్ డౌన్ అవ్వ‌డానికి ఓ కార‌ణం అయ్యాడ‌నే అంటారు.

Tags: ANR, film news, filmy updates, intresting news, latest news, latest viral news, savithri, social media, social media post, Star hero, Star Heroine, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news