టాలీవుడ్ హాట్ యాంకర్ అనసూయ భరద్వాజ్ కు బుల్లితెరపై స్టార్ హీరోయిన్లను మించిన క్రేజ్ ఉంది. ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ బుల్లితెరను వదిలిపెట్టి వెండితెరపై వరుస సినిమాలు చేస్తుంది. ఇప్పటికే రంగస్థలం, పుష్ప వంటి పలు భారీ హిట్ సినిమాల్లో నటించి ప్రేక్షకులను మెప్పించింది. ఈ హాట్ యాంకర్ సినిమాలతో పాటు సోషల్ మీడియాలో కూడా ఫుల్ జోష్‌లోనే ఉంటుంది. ఇలా తన సినీ కెరీర్ మేనేజ్ చేస్తూనే.. తన ఫ్యామిలీ లైఫ్ కూడా బాగా మెయింటైన్ చేస్తుంది.
రీసెంట్గా అనసూయ పెళ్లిరోజు సందర్భంగా తన ఫ్యామిలీతో వెకేషన్ కి వెళ్ళింది. అక్కడ తన భర్త సుశాంక్ పై తన ప్రేమను చూపించింది. ఇక తన మ్యారేజ్ యానివర్సరీ సందర్భంగా వెకేషన్ కి వెళ్ళిన ఈ జంట అక్కడ విచ్చలవిడిగా ఎంజాయ్ చేశారు. సముద్రపు ఒడ్డున బీచ్ లో అనసూయ తన బికినీ అందాలు చూపిస్తూ మరీ తన భర్తకు ముద్దులు వర్షం కురిపించింది. ఇప్పటికే ఆ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
అంతేకాకుండా సోషల్ మీడియాలో అనసూయ తన భర్తపై ఉన్న ప్రేమను ఓ పోస్ట్ రూపంలో రాసుకుంది. ఆ పోస్టు చూస్తే అనసూయకు తన భర్తపై ఎంత ? ప్రేమ ఉందో అర్థమవుతోంది. అనసూయ ఆ పోస్టులో.. 2001లో నువ్వు నాకు లవ్ లెటర్ ఇచ్చావు.. ఆ సమయంలో నేను దానికి రిప్లై ఇవ్వలేకపోయాను.. ఇప్పుడు దానికి సమాధానంగా నా ప్రేమనంత నీపై చూపిస్తున్నానని చెప్పింది.
ఇన్ని సంవత్సరాల మన ప్రయాణంలో నువ్వు నావల్ల ఎన్నో అవమానాలు భరించావు.. ఎంతమంది నిన్ను ఎన్ని మాటలు అన్నా .. నువ్వు అవేమీ పట్టించుకోకుండా నాపై ఎంతో ప్రేమని చూపిస్తున్నావు.. నా కోసం ఎన్నో త్యాగాలు కూడా చేశావు. ఒక్కొక్కసారి నిన్ను చూస్తుంటే నాకు చాలా గర్వం వేస్తుంది.. నన్ను ఎంతగానో అర్థం చేసుకున్నావని తన ప్రేమవర్షం కురిపించేసింది.
మనిద్దరం అంత పర్ఫెక్ట్ కపుల్ కాకపోయినా.. కష్టసుఖాల్లో ఒకరికి ఒకరు తోడిగా నిలిచాము. నన్ను నీ జీవితంలోకి నిండుగా స్వాగతించినందుకు ధన్యవాదాలని అనసూయ ఆ పోస్టులో రాసుకొచ్చింది. ఈ విధంగా అనసూయ తన భర్త పై ప్రేమను కురిపిస్తూ పెట్టిన పోస్ట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.