ఆ స్టార్ హీరో కొడుకు వల్లే అంజలి కెరీర్ నాశనం అయ్యిందా.. వాడుకుని మోసం చేశాడా…!

తెలుగు ఇండస్ట్రీలో వందల మంది స్టార్ హీరోయిన్లు ఉన్నా మన తెలుగు హీరోయిన్ల‌ను వేళ్ల‌పై లెక్కపెట్టవచ్చు. ఈ తరం తెలుగు అమ్మాయిలలో మొదటిగా గుర్తుకు వచ్చే హీరోయిన్ అంజలి. తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టి దశాబ్దం దాటినా ఇంకా టాలీవుడ్ ఇండస్ట్రీలో నెట్టుకు వస్తోంది అంజలి. ఫోటో సినిమాతో తెలుగు ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన అంజలి.. తెలుగుతో పాటు తమిళ ఇండస్ట్రీలో మంచి గుర్తింపు తెచ్చుకుంది.

Celebrity profiles: Tamil actress Anjali Photos, Up coming movies, Profile,  Movies list

ఇంకా చెప్పాలంటే ఆమె తెలుగు అమ్మాయి అయినా కూడా తెలుగు కంటే తమిళ్లో ఎన్నో సూపర్ హిట్ సినిమాలు చేసింది. సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, గీతాంజలి, బలుపు, జర్నీ, వకీల్ సాబ్ వంటి ఎన్నో సూపర్ హిట్ సినిమాల్లో నటించింది అంజలి. ప్రస్తుతం అంజలి రామ్ చరణ్ నటించిన గేమ్ చేంజర్ మూవీలో కీ రోల్ ప్లే చేస్తోంది.

జర్నీ సినిమాలో అంజలికి జంటగా హీరో జై నటించిన సంగతి అందరికీ తెలిసిందే. నిజ జీవితంలో కూడా వీళ్ళిద్దరూ ప్రేమించుకున్నారు. చాలా యేళ్ల పాటు స‌హ‌జీవ‌నం కూడా చేశారు. పెళ్లి చేసుకుంటామంటూ సిగ్న‌ల్స్ కూడా ఇచ్చారు. కానీ ఏవో కార‌ణాల‌ వల్ల వీరు విడిపోవాల్సి వచ్చింది. అయితే అంజలి ఇండస్ట్రీలోకి వచ్చిన కొత్తలో ఒక తమిళ్ స్టార్ హీరో కొడుకుతో ప్రేమలో పడిందట.

Is Anjali in a relationship with Jai? Here is the truth, straight from the  actress

పీకల్లోతు ప్రేమలో ఉన్న‌ అంజలి అతగాడితో డేటింగ్ కూడీ చేసింద‌ట‌. అయితే ఆ స్టార్ హీరో కొడుకు అంజలి పెళ్లి అనేసరికి హ్యాండ్ ఇచ్చాడట. దీంతో చాలా కాలం డిప్రెషన్ లో ఉన్న అంజలి..సినిమాల‌కి దూరం అయింది. కోలుకొని మళ్ళీ ఇండస్ట్రీలోకి రావడానికి చాలా సమయం పట్టింది. ఆ త‌ర్వాత ఆమె జైతో ప్రేమ‌లో ప‌డి స‌హ‌జీవ‌నం చేసినా అది కూడా ఫెయిల్ అయ్యింది.