రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో అంత పెద్దదా… మ‌హేష్ – న‌మ్ర‌త లాగానే వీళ్ల రొమాన్స్ కూడా..!

మెగాస్టార్ చిరంజీవి నట వారసుడుగా టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్.. చిరుత సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చి తొలి సినిమాతోనే మెగా అభిమానులను మెప్పించాడు. ఇక ఆ తర్వాత వరుస సినిమాలు చేసుకుంటూ టాలీవుడ్‌లోనే స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన త్రిబుల్ ఆర్ సినిమాతో ఏకంగా పాన్ ఇండియా హీరో అయిపోయాడు.

Here is combined net worth of Ram Charan, wife Upasana Kamineni

ప్రస్తుతం మరో సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ తో గేమ్ ఛేంజర్ అనే మరో భారీ పాన్ ఇండియా సినిమా చేస్తున్నాడు. చరణ్ పర్సనల్ లైఫ్ విషయానికి వస్తే అపోలో హాస్పిటల్స్ చైర్మన్ ఉపాసనను వివాహం చేసుకున్నాడు. వీరిద్దరూ ఐదేళ్లపాటు ప్రేమించుకుని పెద్దల అంగీకారంతో 2012లో ఒకటయ్యారు. ఇక ప్రస్తుతం రామ్ చరణ్ గ్లోబల్ హీరోగా మారగా… ఉపాసన కూడా సక్సెస్ఫుల్ బిజినెస్ విమెన్‌గా తన సత్తా చాటుతోంది.

వీరిద్దరి దారులు వేరైనా… అభిరుచులు ఒకటి కావడంతో వీరిద్దరి దాంపత్య జీవితం ఎంతో ఆనందంగా సాగుతుంది. అయితే ఇక్కడ ఎవరికీ తెలియని మరో విషయం ఏమిటంటే రామ్ చరణ్ కంటే ఉపాసన వయసులో ఎంత పెద్దదో తెలిస్తే అందరూ షాక్ అవ్వాలి. ఇక రామ్ చరణ్ – ఉపాసన మధ్య నాలుగేళ్ల ఏజ్ గ్యాప్ ఉంది. రామ్ చరణ్ కన్నా ఉపాసన నాలుగు సంవత్సరాలు పెద్దది.

Ram Charan and wife Upasana Kamineni Konidela give a vintage vibe in new  pictures as they celebrate 10 years of togetherness – ThePrint – ANIFeed

న‌మ్మ‌డానికి షాకింగ్‌గా ఉన్నా ఇది నిజం. అయినా వీరిద్ద‌రు ప్రేమకీ వయసుతో సంబంధం లేదని నిరూపించారు. ఇరు కుటుంబాల పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు. ఇక మ‌హేష్‌బాబు కంటే ఆయ‌న భార్య న‌మ్ర‌తా శిరోద్క‌ర్ కూడా వ‌య‌స్సులో యేడాదికి పైగా పెద్ద‌. వీరిద్ద‌రి రొమాన్స్ ఎంత ఇంట్ర‌స్టింగ్‌గా ఉంటుందో… చెర్రీ – ఉపాస‌న రొమాన్స్ కూడా అంతే ఇంట్ర‌స్టింగ్ అనుకోవాలి.

కాగా చ‌ర‌ణ్ – ఉపాస‌న పెళ్లి జరిగి పదేళ్లు అవుతుండగా ఈ జంట తల్లితండ్రులుగా మారిపోతున్నారు. రీసెంట్ గానే ప్రెగ్నెంట్ అయిన ఉపాసన మరి కొద్ది రోజుల్లోనే ఓ పండంటి బిడ్డకు జన్మనివ్వబోతుంది.