సింగిల్ డైలాగ్‌తో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్‌కు ఇచ్చి ప‌డేసిన అన‌సూయ‌… ఏ మాత్రం త‌గ్గ‌ట్లేదుగా..!

జబర్దస్త్ యాంకర్ అనసూయ ప్రస్తుతం ఈ పేరు సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. విజయ్ దేవరకొండపై పరోక్షంగా వివాదాస్పద వ్యాఖ్యలతో సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతుంది. అయితే కొంతకాలం నుంచి సైలెంట్‌గా ఉన్న అనసూయ ఇటీవల విజయ్ దేవరకొండ ఖుషి మూవీ పోస్టర్ ది దేవరకొండ అనే టాగ్ తో రిలీజ్ కావడంతో ఆ పోస్టర్ ను ఉద్దేశించి ది అని ఇంగ్లీష్ అక్షరంపై సెటైర్లు వేసింది. బాబో ది అంట.. పైత్యం ఏం చేస్తాం ? అంటుకుండా చూసుకుందాం.. అని ట్యాగ్ లైన్ పెడుతూ పరోక్షంగా విజయ్ దేవరకొండకి సెటైర్ వేసింది.

Anasuya's Khiladi Talk

దీంతో విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ ఆమెపై ఫైర్ అవుతున్నారు. రకరకాల కామెంట్ల‌తో ఆమెను తిట్టడంతో పాటు.. ఆమెపై అనేక రకాలుగా ట్రోల్స్ చేస్తున్నారు. విజయ్ ఫ్యాన్స్ అనసూయపై బీభత్సం గా ట్రోలింగ్ చేయడంతో అనసూయ ఒక పోస్ట్ షేర్ చేసింది. నువ్వు చేసిన తప్పు తెలుసుకునే వరకు నేను ఇలానే పోరాడుతూ ఉంటాను.. దాని వల్ల‌ నేను మరింత వ్యతిరేకత ఎదుర్కొంటున్నాను. అయినా సరే నేను తగ్గను. నాకు న్యాయం, ధర్మం మీద నమ్మకం ఉంద‌ని చెప్పింది.

నేను మోసగత్తెలా ఏడ్చి కన్నీళ్లు పెట్టుకుని సింపతి సంపాదించే రకం కాదు.. అలా చేయను కూడా. మీరు ఎంత కిందకి లాగిన బురద నాపై చల్లినా నేను పోరాటం ఆపను.. తప్పు ఎవరిదో ఒప్పు ఎవరిదో తెలుసుకునే రోజు కూడా వస్తుంది. అలా వస్తుందని నాకు నమ్మకం ఉంది. దానితో పాటు నేను అటెన్షన్ కోరుకుంటున్నాను… మీరు నాలోని అమ్మను టార్గెట్ చేశారు. అమ్మ తిరగబడితే ఎలా ? ఉంటుందో మీకు చూపిస్తాను. డబ్బులు ఇచ్చి ట్రోల్ చేయించుకోవడానికి నేనేమీ నీలాగా బలహీనురాలని కాదంటూ విజ‌య్‌కు లేదా ఆయ‌న ఫ్యాన్స్‌కు పరోక్షంగా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చింది. అనసూయ ఈ పోస్ట్ చేసిన తర్వాత ట్రోల్స్ మరింతగా పెరిగాయి.

anasuya bharadwaj, Anasuya: మీడియాపై నోరు పారేసుకున్న అనసూయ.. 'మీరు ఉప్పు  కారం తింటే.. ఆ చేతకాని వాళ్లు దారి తప్పారు' - anchor anasuya blames media  over vijay devarakonda kushi ...

అమ్మను టార్గెట్ చేశామా.. నువ్వెప్పుడూ అలా ప్రవర్తించావు తల్లి.. ఎప్పుడు సెక్సీ హాట్ ఫొటోస్ సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ కుర్రాలను రెచ్చగొట్టే నువ్వు.. అమ్మతనం గురించి మాట్లాడుతున్నావా ?అంటూ మరిన్ని ట్రోల్స్ చేస్తున్నారు. ట్రోలింగ్‌ ఆగకపోవడంతో లైవ్‌లో అనసూయ రియాక్ట్ అయింది. నాలాంటి పబ్లిక్ ఫిగర్స్ పై ట్రోలింగ్ జరగడం చాలా కామన్.. లేని వాటిని వార్తలుగా రాస్తూ పబ్లిసిటీ తెచ్చుకోవడం కాదని ఫైర్ అయ్యింది.

Liger' money laundering probe: Vijay Devarakonda appears before ED

 

నన్ను తిట్టిన వారి నోరే కంపు అవుతుంది. కానీ పడినవారు చెడ్డవారు కారు. సో మీకు ధైర్యం ఉంటే ఉప్పు కారాలు తిని ఉంటే నిజం మాత్రమే రాయండి. నేను నిజం మాట్లాడా.. నా అభిప్రాయాన్ని తెలియజేశా.. అని చెప్పిన అనసూయ.. చేతకాని వారే అదుపుతప్పి మాట్లాడుతారు. ఇది మీరు రాయాల్సిన తంబ్ నెయిల్ అంటూ వ్యాఖ్యానించింది. అంటే ఈ వీడియోలో మీడియా వర్గాలతో పాటు విజయ్ దేవరకొండ ఫ్యాన్స్ కి కూడా పరోక్షంగా కౌంటర్ ఇచ్చింది అనసూయ. ఏదేమైనా వీరిద్ద‌రి వార్ ఆగేలా లేదు.