మ‌రో ఊర‌మాస్ డైరెక్ట‌ర్‌తో బాల‌య్య 110వ సినిమా ఫిక్స్‌…!

నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోన్న సంగ‌తి తెలిసిందే. అఖండ ఆ త‌ర్వాత వీర‌సింహారెడ్డి సినిమాతో మ‌రో హిట్ త‌న ఖాతాలో వేసుకున్నాడు. ఇదిలా ఉంటే ప్ర‌స్తుతం బాల‌య్య అనిల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కుతోన్న త‌న 108వ సినిమాలో న‌టిస్తున్నాడు. కాజ‌ల్ అగ‌ర్వాల్ హీరోయిన్‌గా న‌టిస్తోన్న ఈ సినిమాలో యంగ్ హీరోయిన్ శ్రీలీల బాల‌య్య‌కు వ‌రుస‌కు కూతురు పాత్ర‌లో క‌నిపిస్తోంద‌ని వార్త‌లు వ‌స్తోన్న సంగ‌తి తెలిసిందే.

Waltair Veerayya Director Bobby Takes The Help Of Astrology?

ఈ సినిమా త‌ర్వాత బాల‌య్య మ‌రోసారి బోయ‌పాటి శ్రీనుతో క‌మిట్ అయిన‌ట్టే. బోయ‌పాటి ప్ర‌స్తుతం రామ్ హీరోగా ఓ సినిమా తెర‌కెక్కిస్తున్నాడు. ఆ సినిమా షూటింగ్ పూర్త‌యిన వెంట‌నే బాల‌య్య – బోయపాటి కాంబోలో అఖండ 2 ఉంటుంది. బోయ‌పాటి కూడా ప్ర‌స్తుతం అఖండ సీక్వెల్‌గా అఖండ 2 ప‌నులు జ‌రుగుతున్నాయ‌ని ఇప్ప‌టికే చాల‌సార్లు చెప్పారు. ఈ సినిమా వ‌చ్చే ఎన్నిక‌ల నేప‌థ్యంలో ఉండ‌వ‌చ్చ‌ని కూడా తెలుస్తోంది.

బోయ‌పాటితో అఖండ 2 త‌ర్వాత బాల‌య్య 110వ సినిమా కూడా అప్పుడే తెర‌మీద‌కు వ‌చ్చేసింది. ఈ సినిమాను ఓ ఊర‌మాస్ డైరెక్ట‌ర్ తెర‌కెక్కిస్తూ ఉండ‌డం విశేషం. ఆ ఊర‌మాస్ డైరెక్ట‌ర్ ఎవ‌రో కాదు కేఎస్‌. ర‌వీంద్ర ( బాబి). బాబి ఈ యేడాది సంక్రాంతికి మెగాస్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీర‌య్య సినిమాను తెర‌కెక్కించారు.

Nandamuri Balakrishna Turns 62: Here's Why This Birthday is So Special For  Balayya

ఈ సినిమాతో తాను స్టార్ హీరోల‌ను డీల్ చేయ‌గ‌ల‌న‌ని.. తాను మాస్ సినిమాలు బాగా తెర‌కెక్కిస్తాన‌ని మ‌రోసారి ఫ్రూవ్ చేసుకున్నారు. ఈ క్ర‌మంలోనే ఇప్పుడు బాల‌య్య హీరోగా ఓ మాస్ స‌బ్జెక్ట్ రెడీ చేసుకున్నాడ‌ని… ఈ సినిమాను టాలీవుడ్‌లో ఓ టాప్ బ్యాన‌ర్ నిర్మిస్తోంద‌ని తెలుస్తోంది. దీనిపై పూర్తి వివ‌రాలు త్వ‌ర‌లోనే వెల్ల‌డి కానున్నాయి.