మన స్టార్ హీరోల ఇళ్ల‌ ఖరీదు అన్ని కోట్లా… వాటి విలువ చూస్తే కళ్ళు జిగేల్…!

సినిమా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్లుగా ఎదగడానికి ఎంతో కష్టపడాల్సి ఉంటుంది. ఇటీవల స్టార్స్ గా ఎదిగిన‌ చాలామంది న‌టిన‌టులు సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటూ వారి పర్సనల్ విషయాలను షేర్ చేసుకుంటున్నారు. ఇలాంటి విషయాలపై జ‌నం కూడా ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. దాంతోపాటే వారు సినిమాల్లో నటించేందుకు తీసుకుంటున్న రెమ్యునరేషన్, వారి ఆస్తుల విలువలపై కూడా ఆసక్తి చూపుతున్నారు. కొంతమంది సౌత్ హీరోలు ఉంటున్న వాళ్ళ‌ ఇంటి ఖరీదు ఎంతో చూద్దాం.

Take a virtual tour into Dhanush's warm and quaint home in Chennai; PHOTOS  & VIDEOS | PINKVILLA

 

ధనుష్ :
స్టార్ హీరో ధనుష్ సార్ సినిమాతో ఇటీవల సూపర్ హిట్ తన ఖాతాలో వేసుకున్నాడు. రీసెంట్‌గా చెన్నైలో రు. 150 కోట్ల విలువ చేసే ఇంటిని కట్టుకున్నాడు. తన టేస్ట్ కు తగ్గట్టు కట్టుకున్న ఇంట్లో తన కుటుంబంతో కలిసి ఉండాలనుకున్న ధనుష్ ఈ ఇంటిని తన అమ్మా, నాన్నలకు గిఫ్ట్ గా ఇచ్చారు.

Allu Arjun Luxury Life | Net Worth | Salary | Business | Cars | House  |Marriage Family | Biography - YouTube

అల్లు అర్జున్ :
ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ప్రస్తుతం ఉంటున్న ఇంటి ఖరీదు తెలిస్తే షాక్ అవుతారు. టాలీవుడ్ స్టార్ హీరోస్ అందరిలోనూ అత్యంత ఖరీదు అయిన ఇంట్లో ఉంటున్న వారిలో అల్లు అర్జున్ ఒకరు. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో అల్లు అర్జున్ నివాసం ఉంటున్న ఇంటి విలువ దాదాపు రు. 100 కోట్లు ఉంటుంది.

Prabhas Luxury Life | Net Worth | Salary | Business | Cars | House |  Marriage | Family | Biography - YouTube

ప్రభాస్ :
రెబల్ స్టార్ ప్రభాస్.. బాహుబలి సినిమా తర్వాత పాన్ ఇండియా స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ ప్రస్తుతం జూబ్లీహిల్స్ లోని తన విలాసవంతమైన ఫామ్ హౌస్ లో ఉంటున్నాడు. ఆ ఫామ్ హౌస్ విలువ‌ దాదాపు రు. 55 కోట్లకు పైగా ఉంటుంది.

Akkineni Nagarjuna Luxury Life | Net Worth | Salary | Business | Cars |  House | Family | Biography - YouTube

నాగార్జున :
అక్కినేని నాగార్జునకి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. నాగార్జున హైదరాబాదులోని జూబ్లీహిల్స్ లో తన ఫ్యామిలీతో కలిసి నివసిస్తున్నాడు. ఇక జూబ్లీహిల్స్ లో ఉంటున్న తన ఇంటి ఖరీదు దాదాపు రు.40 నుండి రు. 50 కోట్ల విలువ చేస్తుందట.

MAHESH BABU HOUSE IN HYDERABAD - YouTube

మహేష్ బాబు :
సూపర్ స్టార్ మహేష్ బాబు తన ఫ్యామిలీతో కలిసి లేటెస్ట్ టెక్నాలజీ తో కూడిన ఇంట్లో నివసిస్తున్నారు. అయితే మహేష్ బాబుకి హైదరాబాద్ లో రెండు బిల్డింగ్స్ ఉన్నాయి. ఈ రెండు బిల్డింగ్స్ విలువ దాదాపు రు. 28 కోట్లకు పైగా ఉంటుంది.

Chiranjeevi house | Zee News Telugu

చిరంజీవి :
మెగాస్టార్ చిరంజీవి ఈ పేరుకు ప్రత్యేకమైన పరిచయం అవసరం లేదు. తన ఫ్యామిలీతో కలిసి హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో ఉంటున్నారు చిరంజీవి. ఇక చిరంజీవి ఉండే ఆ ఇల్లు ధర దాదాపు రు. 30 కోట్లకు పైగానే ఉంటుందట. అలాగే చెన్నైలో చిరంజీవికి రు. 20 కోట్ల విలువ చేసే మరో ఇల్లు కూడా ఉందట.