‘ ఏజెంట్ ‘ డిజాస్ట‌ర్‌… ఓ మంచి వ్య‌క్తిని న‌డిరోడ్డు మీద‌కు లాగేసిన అఖిల్‌…?

టాలీవుడ్ తీరు మార‌డం లేదు. ఇక్క‌డ ఎవ‌రికి వాళ్లు కోట్లు పోగేసుకోవాల‌న్న తాప‌త్ర‌యంతో ఇండ‌స్ట్రీని నిలువునా ముంచేస్తున్నారు. కాంబినేష‌న్లు చూసి కోట్లు కుమ్మ‌రించేయాలి.. వీళ్ల‌కు క‌థ‌లు అవ‌స‌రం లేదు. నాన్ థియేట్రిక‌ల్ ఆదాయం పెరుగుతోంది క‌దా ? అని హీరోలు ఇష్టం వ‌చ్చిన‌ట్టు రెమ్యున‌రేష‌న్లు పెంచేస్తున్నారు. స‌రైన క‌థ‌లు లేక ఇష్టం వ‌చ్చిన‌ట్టు ఖ‌ర్చు పెట్టేసి సినిమా ప్లాప్ అయ్యాక నిర్మాత‌లు నిండా మునిగిపోతున్నారు.

Agent's OTT Release Date Confirmed: Deets Inside

ఏజెంట్ సినిమా నిర్మాత అనిల్ సుంక‌ర‌కు ఇండ‌స్ట్రీలో మంచి పేరు ఉంది. ఆయ‌నో అజాత శ‌త్రువు అంటారు అంద‌రు. ఆయ‌న వివాదాల‌కు ఎప్పుడూ దూరంగానే ఉంటారు. ఇక అఖిల్ స‌రైన క‌థ లేకుండా, అస‌లు బౌండెడ్ స్క్రిఫ్ట్ లేకుండా సినిమా చేయ‌డంతో ఏజెంట్ అట్ట‌ర్ ప్లాప్ అవ్వ‌డంతో పాటు ఆ సినిమా కొన్న వాళ్లు, తీసినోళ్లు అంద‌రిని రోడ్డు మీద‌కు లాగేసింది.

వైజాగ్ ఏరియాలో ఓ మంచి పంపిణీదారుడిగా వున్న గాయత్రీ ఫిలింస్ అధినేత‌ సతీష్ కేవలం ఒక్క సినిమా ఏజెంట్ కారణంగా జీవిత కాలంలో ఆయ‌న సాధించిన‌ లాభాలు అన్నీ పొగొట్టేసుకున్నారు. ఈ సినిమా దెబ్బ‌తో ఆయ‌న ఏకంగా రు. 25 – 30 కోట్ల ఊబిలో కూరుకుపోయాడంటున్నారు. అంటే జీవితాంతం ఆయ‌న ఎంతో క‌ష్ట‌ప‌డి కూడ‌బెట్టిన ఒక్కో రూపాయి ఈ ఏజెంట్ దెబ్బ‌తో హార‌తి క‌ర్పూరంలా క‌రిగిపోయింది.

Filmmaker Anil Sunkara Apologises to Akhil Akkineni Fans; Find Out Why

ఇక దిల్ రాజు లాంటి బ‌డా డిస్ట్రిబ్యూట‌రే గత నెల రోజుల్లో పంపిణీ రంగంలోనే ఏకంగా రు 30 – 40 కోట్లు లాస్ అయ్యాడంటున్నారు. ఇప్ప‌ట‌కి అయినా మ‌న తెలుగు నిర్మాత‌లు కాంబినేష‌న్లు కాకుండా క‌థ‌ల‌ను న‌మ్ముకుంటేనే డిస్ట్రిబ్యూష‌న్ వ్య‌వ‌స్థ ప‌దికాల‌ల పాటు ఉంటుంది. లేక‌పోతే ఈ వ్య‌వ‌స్థ‌తో పాటు ఎగ్జిబిట‌ర్ అనే వాడు త్వ‌ర‌లోనే క‌నుమ‌రుగు అయ్యే ప్ర‌మాదం ఉంద‌ని కూడా ఇండ‌స్ట్రీ వాళ్లు భ‌య‌ప‌డుతున్నారు.