ప్రభాస్ అన్న అలాంటి పనులు చేసి జైలుకి కూడా వెళ్లాడా..?

రెబల్ స్టార్ ప్రభాస్.. కృష్ణంరాజు నటి వారసుడిగా ఇండస్ట్రీలోకి వచ్చాడు. ప్రభాస్ కి ప్రపంచవ్యాప్తంగా ఉన్న క్రేజ్ తెలిసిందే. బాహుబలి సినిమాతో పాన్ ఇండియా హీరోగా మారిన ప్రభాస్.. ప్రస్తుతం వరుస సినిమా షూటింగ్‌ల‌లో బిజీగా ఉన్నాడు. ప్రభాస్ చాలామందికి సుపరిచితుడైనా అతని అన్న గురించి చాలామందికి తెలియదు. కృష్ణంరాజు తమ్ముడు నిర్మాత ఉప్పలపాటి సూర్యనారాయణకు మొత్తం ముగ్గురు పిల్లలు.

Prabhas Wiki, Age, Height, Weight, Family, Girlfriend, Biography

 

 

వారిలో ఒకరు కుమార్తె, ఇద్దరు కుమారులు. మొదటి కుమారుడు ప్రబోధ్, రెండవ కుమారుడు ప్రభాస్ సినిమాల పైన ఉన్న ఇంట్రెస్ట్ తో పెదనాన్న నట వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు. కానీ ప్రబోధ్ సినిమాలపై పెద్దగా ఆసక్తి లేకపోవడంతో తనకు బిజినెస్ పై ఉన్న ఇంట్రెస్ట్ తో భీమవరం, మొగల్తూరులో ఉండే వాళ్ళ కొబ్బరి తోటలు, రొయ్యల చెరువులు, చేపల చెరువులను చూసుకుంటూనే మరోవైపు చాలా బిజినెస్ చేస్తున్నాడు.

Throwback: When Prabhas posed for a perfect PIC with his late uncle  Krishnam Raju and family | PINKVILLA

కృష్ణంరాజు, ప్రభాస్ సలహాలతో యువి క్రియేషన్స్ వారి బ్యానర్లో ఫైనాన్షియర్ గా ఉండేవాడు. అలాంటి ప్రబోధ్ ఒక చిన్న తప్పు చేయడం వల్ల జైలుకు వెళ్లాడని చాలామందికి తెలియదు. ఇంతకీ అసలు విషయానికి వస్తే ప్రబోధ్ ఒకసారి ఒక ప్రముఖ బిజినెస్ మాన్‌కు రు. 43 లక్షల చెక్ అందించగా అది బౌన్స్ అయ్యింది. దీంతో ప్ర‌భోద్‌పై ఆ బిజినెస్ మాన్ కేస్ వేసాడట. దీంతో ప్రబోధ్ కొంత‌కాలం జైల్లో ఉండాల్సి వచ్చింది. ఈ విషయం చాలామందికి తెలియదు.

Prabhas family function | Prabhas family, Indian wedding photography poses,  Prabhas pics

ప్రభోద్ జైల్లో ఉన్న టైంలో ఆయన వ్యాపారాలకు చాలా బాగా నష్టం కలిగింది. కానీ ఆయన జైలు నుంచి రిలీజ్ అయి వచ్చిన తర్వాత అంతే వేగంగా బిజినెస్‌లో పుంజుకుని.. ప్రస్తుతం తనే ఎంచుకున్న వ్యాపారంగంలో లాభాలతో రాణిస్తున్నాడు. అయితే ఈ న్యూస్ నెట్టింట వైరల్ కావడంతో కొంతమంది ప్రభాస్ అన్న అలాంటి పని చేసి జైలుకి కూడా వెళ్లాడా ? అంత మంచి ఫ్యామిలీ నుంచి వ‌చ్చి ఇలాంటి ప‌నులు నిజంగానే చేశాడా ? అన్న డౌట్లు వ్య‌క్తం చేస్తున్నారు.