చ‌చ్చింది గొర్రె… క‌ళ్యాణ్‌రామ్ డెవిల్ – నిఖిల్ స్పై స్టోరీలు ఒక్క‌టే… త‌ల ప‌ట్టుకుంటున్నారుగా..!

ఒకే క‌థ‌తో వ‌చ్చిన సినిమాలు చాలానే ఉంటాయి. మెయిన్ లైన్ తీసుకుని కాస్త అటూ ఇటూ తిప్పేసి తీసేస్తూ ఉంటారు. ఇందులో కొన్ని హిట్ అవుతుంటాయి. కొన్ని ఫ‌ట్ అవుతూ ఉంటాయి. అప్పుడెప్పుడో టాలీవుడ్‌లో దాదాపు ఒకే క‌థాంశంతో తెర‌కెక్కిన వెంక‌టేష్ ర‌క్త‌తిల‌కం, బాల‌కృష్ణ అశోక చ‌క్ర‌వ‌ర్తి రెండు సినిమాలు మాఫియా డాన్ క‌థాంశంతో వ‌చ్చాయి. పైగా రెండు సినిమాలు ఒకే రోజు రిలీజ్ అయ్యాయి.

In First Teaser Of Telugu Film Spy, Nikhil Looks Slick And Stylish

ఇందులో వెంక‌టేష్ సినిమా ఆడితే.. బాల‌య్య అశోక చ‌క్ర‌వ‌ర్తి అంచ‌నాలు అందుకోలేదు. ఇక తాజాగా ఇద్ద‌రు యంగ్ హీరోలు న‌టిస్తోన్న రెండు సినిమాలు ఒకే క‌థాంశంతో వ‌స్తున్నాయ‌న్న చ‌ర్చ‌లు ఇండ‌స్ట్రీ వ‌ర్గాల్లో వినిపిస్తున్నాయి. ఈ రెండు కూడా ఇంకా రిలీజ్ కాలేదు. ఆ సినిమాలు ఏవో కాదు క‌ళ్యాణ్‌రామ్ న‌టిస్తోన్న డెవిల్‌. నిఖిల్ న‌టిస్తోన్న స్పై.

ఈ రెండు సినిమాలు కూడా ప్ర‌ముఖ స్వాతంత్య్ర స‌మ‌ర‌యోధుడు సుభాష్ చంద్రబోస్ మీదే వస్తున్నాయ‌ట‌. అయితే డెవిల్ కూడా ఇదే బోస్ మృతి మీదే వ‌స్తుంద‌న్న విష‌యం మా సినిమా టీజ‌ర్ రిలీజ్ అయ్యే వ‌ర‌కు మాకూ కూడా తెలియ‌ద‌ని చెప్పాడు. అంటే నిఖిల్ రెండు సినిమాల మెయిన్ స్టోరీ లైన్ ఒక్క‌టే అని హింట్ ఇచ్చేశాడు. అయితే క‌ళ్యాణ్‌రామ్ సినిమా 1920 బ్యాక్ డ్రాప్ లో ఉంటే, నిఖిల్ సినిమా ప్ర‌స్తుత కాలంలోనే స్టోరీ ఉంటుంద‌ట‌.

Devil - The British Secret Agent Title Announcement Teaser | Nandamuri  Kalyan Ram | Abhishek Nama - YouTube

సుభాష్ చంద్రబోస్ కు సంబంధించి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన పత్రాలను ఆధారంగా చేసి.. ఆ క‌థ‌కు 10 శాతం క‌ల్పితం జోడించి స్పై సినిమా తెర‌కెక్కించామ‌ని నిఖిల్ చెపుతున్నాడు. ప్ర‌భుత్వం వెల్ల‌డించిన స‌మాచారం ఆధారంగానే త‌మ సినిమా ఉంటుంద‌ని నిఖిల్ చెపుతున్నా రెండు సినిమాల మేక‌ర్స్ మాత్రం కాస్త టెన్ష‌న్ తోనే ఉంటున్నారు. ఇక ఈ రెండు సినిమాల‌లో ఇద్ద‌రూ గూఢచారిలుగానే క‌నిపించ‌బోతున్నారు.