త‌న‌కు లైఫ్ ఇచ్చిన డైరెక్ట‌ర్‌కే దెబ్బ కొట్టిన రాజేంద్ర ప్ర‌సాద్‌… !

ద‌ర్శ‌కుడు వంశీ.. న‌టుడు,ఒక త‌రం హీరో రాజేంద్ర‌ప్ర‌సాద్ క‌లిసి ప‌లు సినిమాలు చేశారు. ఇవ‌న్నీ కూడా సూప‌ర్ హిట్ కొట్ట‌డం విశేషం. అంతేకాదు.. వీరిద్ద‌రి కాంబినేష‌న్ కూడా హిట్ అయింది. ద‌ర్శ‌కుడు వంశీ, హీరో రాజేంద్ర‌ప్ర‌సాద్ అంటే..బ‌య్య‌ర్లు ఎగ‌బ‌డి మ‌రీ కొనేవార‌ట‌.లేడీస్ టైల‌ర్‌, ఏప్రిల్ 1 విడుద‌ల సినిమాలు ఎవ‌ర్ గ్రీన్‌గా నిలిచాయి. అయితే..వీరిద్ద‌రి కాంబినేష‌న్ ఇంత హిట్ కావ‌డానికి రీజ‌న్ ఉందని అంటారు.

Vamsy Vexed With Rajendra Prasad!? | cinejosh.com

రాజేంద్ర‌ప్ర‌సాద్‌ను ముందుగానే ఊహించుకుని వంశీ సినిమా క‌థ రాసుకునేవార‌ట. ఇక‌, డైలాగుల విష యానికివ‌చ్చినా కూడా రాజేంద్ర‌ప్ర‌సాద్ మాడ్యులేష‌న్‌కు అనుగుణంగా ఆయ‌న డైలాగులు రాసుకునేవార ని అంటారు. పైగా.. సినిమాల‌కు పెద్ద‌గా ఖ‌ర్చు పెట్ట‌డం కంటే.. ఎక్కువ లాభాలు వ‌చ్చేలా తీయాల‌నేది రాజేంద్ర‌ప్ర‌సాద్ కాన్సెప్ట్‌. అందుకే ఆయ‌న సినిమాల‌కు పెద్ద‌గా ఖ‌ర్చులు ఉండ‌వు.

APRIL 1 VIDUDALA | TELUGU FULL MOVIE | RAJENDRA PRASAD | SHOBANA | TELUGU  CINEMA ZONE - YouTube

ఇదే ఫార్ములాను వంశీ కూడా పాటించేవారు. దీంతొ వీరిద్ద‌రికీ.. కూడా.. కాంబినేష‌న్ అతికిన‌ట్టుగా కాకుండా .. గోడ‌కు రంగులు అద్దిన‌ట్టు స‌రిపోయిందనే టాక్ ఉంది. అయితే.. వంశీకి-రాంజేద్ర‌ప్ర‌సాద్‌కు ఒక‌సంద ర్భంలో గొడ‌వ జ‌రిగింది. రాజేద్ర‌ప్ర‌సాద్ నిర్మాత‌గా అవ‌తారం ఎత్తాక‌.. అప్ప‌టి వ‌ర‌కు త‌న‌కు లైఫ్ ఇచ్చిన వంశీని వ‌దిలేశారు. ముఖ్యంగా వంశీ రాసుకున్న రాంబంటు క‌థ‌ను కొన్న రాజేంద్ర ప్ర‌సాద్ దీనిని ఆయ‌న‌తోనే తీయాల‌ని అనుకున్నారు.

Ladies Tailor Songs Download: Ladies Tailor MP3 Telugu Songs Online Free on Gaana.com

కానీ, చివ‌ర‌లో ఆయ‌న బాపుతో తీసుకున్నారు. భారీగానే ఖ‌ర్చుపెట్టారు. నిజానికి ఇది రాజేంద్ర‌ప్ర‌సాద్ మ‌న‌స్తత్వానికి విరుద్దం అయినా.. కూడా ఆయ‌న ఎక్కువ‌గానే ఖ‌ర్చు పెట్టారు. చివ‌ర‌కు సినిమా ఫ్లాప్ అయింది. ఇదే విష‌యంలో వంశీ రాజేంద్ర‌ప్ర‌సాద్‌పై కామెంట్ చేశారు. దీంతో అప్ప‌టి నుంచి వీరిద్ద‌రి కాంబినేష‌న్‌కు తెర‌ప‌డిపోయింది. త‌ర్వాత వంశీ తీసిన సినిమాల్లో వేరేవారిని పెట్టుకున్నారు. ఇదీ.. సంగ‌తి..!