క‌డ‌ప‌లో ఈ సారి 5 సీట్లు పోతాయ్‌… వైసీపీ రెడ్డి గారి మాట‌…!

ఎస్ ఈ మాట ఇప్పుడు క‌డ‌ప రాజ‌కీయాల్లో బాగా చ‌ర్చ‌కు వ‌స్తోంది. పైగా గ‌త ఎన్నిక‌ల్లో 10కి 10 ఎమ్మెల్యే, క‌డ‌ప‌, రాజంపేట రెండు ఎంపీసీట్లు గెలుచుకున్న వైసీపీ ఈ సారి వ‌చ్చే ఎన్నిక‌ల్లో గ‌ట్టి పోటీ మ‌ధ్య‌లో విల‌విల్లాడ‌డం ఖాయ‌మ‌ని ప‌లు స‌ర్వేలు, అంచనాలు చెపుతున్నాయి. జిల్లాకే చెందిన సీనియ‌ర్ వైసీపీ నేత‌లు, త‌ల‌పండిన రాజ‌కీయ నేత‌లు సైతం ఈ సారి జిల్లాలో వైసీపీ 5-6 సీట్ల‌లో గెలిస్తే గొప్పే అంటున్నారు.

వైసీపీ నేతలకు సీఎం జగన్ కొత్త టార్గెట్ - YS Jagan sets New target to YCP  Leaders– News18 Telugu

క‌డ‌ప‌, రాజంపేట రెండు ఎంపీ సీట్లు వైసీపీకే అనుకూలంగా ఉన్నా ఎమ్మెల్యే సీట్ల‌లో ఈ సారి ఐదారు చోట్ల వైసీపీ ఏటికి ఎదురీదుతోంది. రాజంపేట‌, రాయ‌చోటి, రైల్వేకోడూరు, మైదుకూరు, ప్రొద్దుటూరు, క‌మ‌లాపురం నియోజ‌క‌వ‌ర్గాల్లో వైసీపీకి ఏ మాత్రం సానుకూల ప‌రిస్థితులు లేవు. రాయ‌చోటిలో ఎంత బ‌లంగా ఉండే శ్రీకాంత్ రెడ్డికే ఈ సారి క‌ష్టాలు త‌ప్ప‌వ‌ని అంటున్నారు.

వైసీపీకి చెందిన జ‌గ‌న్ హార్డ్ కోర్ వీరాభిమానులు, రెడ్డి వ‌ర్గం వారే ఈ విష‌యం చెపుతున్నారు. టీడీపీ కాస్త బ‌ల‌మైన అభ్య‌ర్థుల‌ను పోటీలో పెట్టి, గ్రూపు త‌గాదాలు లేకుండా చూసుకుంటే ఖ‌చ్చితంగా 5 సీట్ల‌లో విన్ అవుతుంద‌నే అంటున్నారు. క‌మ‌లాపురం, రాజంపేట‌, మైదుకూరు, ప్రొద్దుటూరులో టీడీపీ విజ‌యావ‌కాశాలు రోజు రోజుకు బాగా మెరుగ‌వుతున్నాయ‌ని వైసీపీ వాళ్లే అంగీక‌రిస్తున్నారు.

Chandrababu Naidu to tour Krishna district to reclaim lost TDP bastion- The  New Indian Express

ఏదేమైనా జ‌గ‌న్ సొంత జిల్లాలోనే ఈ సారి ఏటికి ఎదురీదే ప‌రిస్థితి వ‌చ్చేసింది. జిల్లాలో రెడ్డి సామాజిక వ‌ర్గం దూకుడు కూడా మిగిలిన సామాజిక వ‌ర్గాల వారికి ఇబ్బందిగా మారింది. మ‌రి ఈ సారి క‌డ‌ప ఓట‌రు భిన్న‌మైన తీర్పు కోసం ఎదురు చూడాల్సిందే..!