డిజాస్ట‌ర్ ‘ ఏజెంట్‌ ‘ … బ‌న్నీ ఫ్యాన్స్ సంబ‌రాలు మామూలుగా లేవుగా…!

అక్కినేని అఖిల్ నటించిన ఏజెంట్ సినిమా ఫ్లాప్ అయింది. ఇంకా చెప్పాలి అంటే పెద్ద డిజాస్ట‌ర్ అయ్యింద‌నే చెప్పాలి. అంద‌రూ సేఫ్ అయిపోయారు. ఎవ‌రికి వారు సినిమా ప్లాప్ అని చెప్పి ఆ భారం దించేసుకున్నారు. ఇప్పుడు ద‌ర్శ‌కుడు సురేంద‌ర్ రెడ్డి అంద‌రికి కార్న‌ర్ అయిపోయారు. సినిమా ప్లాప్ అయిన వెంట‌నే నిర్మాత అనీల్ సుంకర బౌండ్ స్క్రిప్ట్ లేకుండా సెట్స్ పైకి వెళ్లి చేతులు కాల్చుకున్నామ‌ని.. మ‌రోసారి ఆ త‌ప్పు చేయ‌మ‌ని చెపుతూ డైరెక్ట‌ర్ సురేందర్ రెడ్డిపై మొదటి రాయి వేశాడు.

Agent: Akhil Akkineni promises action like never before in ...

ఇక ఇప్పుడు అఖిల్ కూడా స్పందిస్తూ అస‌లు సురేందర్ రెడ్డి పేరు కూడా చెప్పేందుకు ఇష్ట‌ప‌డ‌కుండా ప్రెస్‌నోట్ రిలీజ్ చేశాడు. ఏజెంట్ సినిమా ఫ్లాప్ అయినా నిర్మాత అనిల్ సుంకరకు వ‌చ్చిన ఇబ్బంది లేదు. మరో సినిమాపై ఫోకస్ పెట్టాడు. అఖిల్ కూడా నాగార్జున కొడుకు కావ‌డంతో ఎన్ని సినిమాలు అయినా చేసుకుంటాడు. ఇక హీరోయిన్ సాక్షి వైద్య‌కు ఎలాగూ గ్లామ‌ర్ ఉన్నందున అవ‌కాశాల‌కు ఇబ్బంది లేదు.

ఇక సురేంద‌ర్ రెడ్డి సైరా దెబ్బ త‌ర్వాతే చాలా గ్యాప్ తీసుకున్నాడు. ఏజెంట్ కోసం యేళ్ల‌కు యేళ్లు గ్యాప్ తీసుకోవాల్సి వచ్చింది. ఏజెంట్ పెద్ద డిజాస్ట‌ర్ కావ‌డంతో ఇప్పుడు మ‌నోడికి అవ‌కాశాలు రావు. ఖ‌చ్చితంగా మ‌రో మూడు, నాలుగేళ్లు గ్యాప్ తీసుకోవ‌డం ఖాయం. ఇదిలా ఉంటే ఏజెంట్ ఘోర‌మైన డిజాస్ట‌ర్ కావ‌డంతో బ‌న్నీ ఫ్యాన్స్ సంబ‌రాల‌కు అంతే లేద‌ట‌.

Pinterest

ఎందుకంటే బ‌న్నీ నెక్ట్స్ సురేంద‌ర్ రెడ్డితో ఓ సినిమా ప్లాన్ చేసుకుంటున్నాడు. ఇలాంటి ముంచేసే డైరెక్ట‌ర్‌ను న‌మ్ముకుని బ‌న్నీ సినిమా చేస్తే త‌మ హీరో కూడా నిండా మునిగిపోయేవాడ‌ని… ఏజెంట్ దెబ్బ‌తో ఇప్పుడు బ‌న్నీ త‌న సినిమా క్యాన్సిల్ చేసుకున్నాడ‌ని.. సురేంద‌ర్‌రెడ్డిలో స్ట‌ఫ్ లేద‌ని ఏజెంట్ సినిమాతో తేలిపోయింద‌ని బ‌న్నీ ఫ్యాన్స్ చెవులు కొరుక్కుంటున్నారు.