సూప‌ర్‌స్టార్ కృష్ణ‌కు రెండు పెళ్లిళ్ల త‌ర్వాత కూడా మ‌రో ఇద్ద‌రు హీరోయిన్ల‌తో ఎఫైర్ ?

టాలీవుడ్ లో దివంగత సూపర్ స్టార్ కృష్ణ ఎన్నో సినిమాలతో.. ఎంతోమంది ప్రేక్షకులను కొన్ని దశాబ్దాలుగా ఆకట్టుకున్నారు. అయితే కృష్ణ వ్యక్తిగత జీవితం విషయానికి వస్తే ముందుగా తన సొంత మరదలు ఇందిరా దేవిని పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు ఇద్దరు కుమారులు.. ముగ్గురు కుమార్తెలు ఉన్నారు.

Vijaya Nirmala: A full life, in retrospect - The Hindu

అనంతరం తనతో పాటు ఏకంగా 42 పైగా సినిమాలలో నటించి.. పైగా తన సినిమాలకు దర్శకత్వం వహించి.. తనకు స్టార్ ఇమేజ్ రావటంలో కీలకపాత్ర పోషించిన తోటి హీరోయిన్ విజయనిర్మలను తిరుపతిలో సీక్రెట్గా పెళ్లి చేసుకున్నారు. ఇది కృష్ణకు రెండో వివాహం. అటు విజయనిర్మలకు కూడా ఇది రెండవ వివాహం కావడం విశేషం. విచిత్రం ఏంటంటే విజయనిర్మలతో పెళ్లయ్యాక కూడా కృష్ణ మరో ఇద్దరూ హీరోయిన్లను బాగా ఇష్టపడ్డారని.. అప్పట్లో ఇండస్ట్రీలో గుసగుసలు ఉన్నాయి.

సీనియర్ హీరోయిన్ జయప్రద – కృష్ణ కాంబినేషన్ అంటే ఒక క్రేజ్. విజయనిర్మల తర్వాత వీరిద్దరి కాంబినేషన్లో ఏకంగా 40 సినిమాలు వచ్చాయి అంటే.. జయప్రద – కృష్ణ కొన్ని సంవత్సరాల పాటు కలిసి నటించారు. ఈ క్రమంలోనే వీరిద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడ్డారు అన్న ప్రచారం అప్పట్లో ఉండేది. ఇక జయప్రద తర్వాత అతిలోకసుందరి శ్రీదేవిని కూడా కృష్ణ బాగా ఇష్టపడేవారు.

Superstar Krishna, Jayaprada : జయప్రద విషయంలో డైరెక్టర్ పై కృష్ణ సీరియస్ ! - OK Telugu

ఆయ‌నే స్వ‌యంగా దర్శక నిర్మాతలతో స్వయంగా శ్రీదేవి డేట్లు బుక్ చేయండి అని చెప్పేవారట‌. శ్రీదేవితో నటించ‌డం అంటే ఎందుకో కృష్ణ‌కు బాగా ఇష్టం అన్నది అప్పట్లో ఓపెన్ టాక్. శ్రీదేవి సంగతి ఎలా ఉన్నా జయప్రద – కృష్ణ మధ్య కూడా ఎఫైర్ నడిచిందని అంటారు. ఈ విషయంలోనే జయప్రదకు విజయనిర్మలకు మధ్య పెద్ద పెద్ద యుద్ధాలు జరిగేవని.. వీరిద్దరూ సరిగా మాట్లాడుకునే వారే కాదని ప్రచారం ఉండేది.

Tags: film news, filmy updates, intresting news, krishna, latest news, latest viral news, social media, social media post, Star hero, super star, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news