వైరాగ్యంలో మెగా డాటర్ నిహారిక‌… షాకింగ్ డెసిష‌న్‌కు అదే కార‌ణ‌మా…?

’ ఒక మనసు ’తో హీరోయిన్‌గా టాలీవుడ్‌లోకి ఎంట్రీ ఇచ్చిన మెగా డాటర్‌ నిహారిక పెళ్లి తర్వాత తరచూ ఏదో ఒక వార్తలో నిలుస్తూనే ఉంది. ఇక గత కొంతకాలంగా నీహారిక, భర్త చైతన్య వైవాహిక జీవితంపై నెట్టింట పలు రూమర్స్ వస్తున్న సంగతి తెలిసిందే. అయితే వీటిపై ఇప్పటిరకూ మెగా ఫ్యామిలీ స్పందించలేదు. గతంలో పలు సిరీస్‌లు, సినిమాలు, షోలు చేసిన నిహారిక ఆ తర్వాత యాక్టింగ్‌కి కాస్త విరామం తీసుకుంది. నిజానికి నిహారికకు సినిమాల కంటే వెబ్ సిరీస్‌ బాగా కలిసి వచ్చాయి.

ఇటీవ‌ల పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ అనే పేరుతో ప్రొడక్షన్ హౌస్ కూడా స్టార్ట్ చేసింది. గత కొద్ది రోజుల నుంచి నిహారిక తన భర్తతో విడాకులు తీసుకోబోతుంది అంటూ నెట్టింట్లో వార్తలు వస్తున్నాయి. ప్రస్తుతం నిహారిక ముఖ్య పాత్రలో తెరకెక్కిన సిరీస్ ‘డెడ్‌ పిక్సెల్స్‌’ యూత్ కి ఈ సిరీస్ బాగా కనెక్ట్ అవుతుంది అని భావిస్తున్నారు. డెడ్ పిక్సెల్స్ సిరీస్ హాట్ స్టార్, ఓటీటీలో మే 19 నుంచి స్ట్రీమింగ్ అవుతోంది. ఈ వెబ్ సిరీస్ లో నటించడం వల్ల వీరిద్దరి మధ్య విభేదాలు వచ్చాయని తెలుస్తోంది.

Niharika Konidela Ties The Knot With Chaitanya JV In A Stunning Celebration At Udaivilas | WeddingBazaar

ఇందులో ఎంతవరకు నిజముందో తెలియదు కానీ వెబ్ సిరీస్ వల్ల ఇద్దరు విడాకులు తీసుకోవడానికి రెడీ అయ్యారు అంటూ వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా నిహారిక తన మెడలో తాయత్తుతో కనిపించింది. నిహారిక మెడలో తాయత్తు చూసిన చాలామంది నెటిజన్స్ ఇదేంటి నిహారిక కొత్తగా మెడలో తాయ‌త్తు కూడా ధరిస్తుందా ? దానికి కారణం ఏంటని సోషల్ మీడియాలో చ‌ర్చించుకుంటున్నారు.

Niharika Konidela : ఛీ..నిహారికు ఎప్పుడు అదే పని కావాలంటూ నిహారిక భర్త షాకింగ్ కామెంట్స్Telugu Online News

ఇక నిహారిక తాయత్తు ధరించటానికి ముఖ్య కారణం ఆమె నటించబోయే తర్వాత సినిమాలు కూడా విజయం అవ్వాలని అలాగే డేట్ పికల్స్ వెబ్ సీరిస్‌ కూడా మంచి సక్సెస్ అవ్వాలని ఉద్దేశంతో ఇలా తాయత్తు ధరించిందని ఒక వార్త వైరల్ గా మారింది. అంతేకాకుండా తన భర్తతో వచ్చిన విభేదాలు కూడా తొలగిపోవాలని ఈ తాయత్తు ధరించిందని మరో వార్త వినిపిస్తుంది. భ‌ర్త‌తో విడాకుల నేప‌థ్యంలో ఆమెలో వైరాగ్యం వ‌చ్చేసింద‌ని కూడా గుస‌గుస‌లు న‌డుస్తున్నాయి.