ప‌వ‌న్ హీరోయిన్‌తో అడ‌వి శేష్ పెళ్లి… ముహూర్తం ఎప్పుడంటే…!

చిత్ర పరిశ్రమలో ఉన్న హీరో హీరోయిన్ల పెళ్లి చేసుకోబోతున్నారని విషయం అంత తొందరగా బయటికి రాదు. వారు పెళ్లి చేసుకోవడానికి రెండు మూడు రోజుల సమయం ఉంది అనగా ఈ విషయాన్ని బయటకు చెబుతారు. ఇక ఇప్పుడు ఈ విషయం ఇలా ఉంచితే టాలీవుడ్ లో తాజాగా మరో పెళ్లి బాజా మోగిపోతుందంటూ సోషల్ మీడియాలో వార్త వైరల్ గా మారింది.

akkada ammayi-ikkada abbayi-telugu-movie-songs-lyrics.2 | Flickr

ఆ పెళ్లి మరెవరిదో కాదు యువ హీరో అడివి శేష్ త్వరలో ఓ ఇంటివాడు కాబోతున్నాడు. కొన్నాళ్లుగా తాను ప్రేమిస్తున్న అమ్మ‌యిని ఇంట్లో ఒప్పించి పెళ్లి చేసుకోబోతున్నాడు. ఇక ఆమె ఎవరో కాదండోయ్ అక్కినేని మ‌న‌వ‌రాలు సుప్రియ‌. ప‌వ‌ర్ స్టార్ పవన్ హీరోగా వ‌చ్చిన తొలి సినిమా అక్క‌డ అమ్మాయి… ఇక్క‌డ అబ్బాయిలో హీరోయిన్‌గా నటించిన సుప్రియ. అడవి శేష్‌- సుప్రియ గత కొంతకాలంగా ప్రేమలో ఉన్నారనే పుకార్లు అందరికీ తెలిసిందే.

Goodachari': Here's an interesting update about the Adivi Sesh starrer | Telugu Movie News - Times of India

గూఢ‌చారి సినిమా షూటింగ్ టైంలో వీరిద్ద‌రి మ‌ధ్య ఏర్ప‌డ్డ ప‌రిచ‌యం ప్రేమ‌గా మారింది. ఇక త్వరలోనే ఇద్దరు పెళ్లి చేసుకోబోతున్నారనే వార్తలు కూడా బయటకు వచ్చాయి. అయితే ఇప్పుడు వీరి ఇరు కుటుంబాల పెద్దలు పెళ్ళికి అంగీకరించడంతో త్వరలోనే వీరిపెళ్లి డేట్ ఫిక్స్ చేస్తారంటూ వార్తలు కూడా వస్తున్నాయి. దీంతో వీరి పెళ్లిని వచ్చేనెల రెండో వారంలో లేదా చివరి వారంలో వీరి పెళ్లి జరగబోతుందనే ప్రచారం కూడా జరుగుతుంది.

బంధం బహిరంగమే...కానీ పెళ్ళికి అడ్డుపడుతున్న శక్తులు ఎవరు | Adavi Sesh Supriya Relationship Status Details, Adivi Sesh, Supriya, Adavi Sesh Supriya Relationship, Adivi Sesh Supriya Dating, Adivi Sesh ...

ఇక‌ సుప్రియ మ‌న స్టార్ హీరో నాగార్జున మేనకోడలు, నటసామ్రాట్‌ అక్కినేని నాగేశ్వరావు మనవరాలు. అంతేకాకుండా హీరో సుమంత్ కు చెల్లి అవుతుంది. ఈ ఇద్దరు పెళ్లికి నాగచైతన్య పెళ్లి పెద్దగా మారినట్టు తెలుస్తుంది. త్వరలోనే ఈ జంట పెళ్లి పీటలు ఎక్కబోతున్నారనే వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.