బీభత్సవం సృష్టిస్తున్న చిరంజీవి – బాలకృష్ణ ఫ్యాన్స్ వార్.. శ్రీలీలానే కారణమా..?

టాలీవుడ్ సీనియర్ స్టార్ హీరోస్ బాలకృష్ణ, చిరంజీవి ఇద్దరికీ ఇండస్ట్రీలో ఎటువంటి క్రేజ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. వీరిద్దరి మధ్యన వ్యక్తిగతంగా స్నేహం ఉన్న అభిమానులు మాత్రం ఎప్పుడూ గొడవలు పడుతూనే ఉంటారు. భోళా శంక‌ర్ సినిమాతో చిరంజీవి భారీ డిజాస్టర్ ఎదుర్కొన్న సంగతి తెలిసిందే. ఆచార్య కన్నా బాగుంటుందిలే అనుకున్నవారికి ఈ సినిమా బోల్తాపడడంతో మరింత షాక్ ఎదురైంది.

చివరకు ట్రోలర్‌స్‌కి కూడా అడ్డంగా దొరికిపోయారు. ఈ సినిమాకు వ్యతిరేకంగా యాంటీ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో తెగ ట్రోల్స్‌ చేయడంతో అభిమానులు సినిమా డిజాస్టర్ కావడం కన్నా ట్రోలింగ్ ఎక్కువగా ఫీల్ అయ్యారు. ఇక వీరి దృష్టి తాజాగా బాలయ్య పైన పడింది. కొంతమంది ఒక టీమ్‌గా ఏర్పడి స్కంద ఈవెంట్లో బాలకృష్ణ మాట్లాడుతున్నప్పుడు శ్రీలీల నవ్వు ఆపుకున్న వీడియోను వైరల్ చేశారు. వాస్తవానికి భగవంత్ కేసరి సినిమా వాల్ల‌ బాలయ్య, శ్రీ లీలా ఇద్దరు బాగా క్లోజ్ అయ్యారు, ఎన్టీఆర్ శ‌త‌ జయంతి వేడుకలకు కూడా శ్రీ లీల హాజరైన సంగతి తెలిసిందే. స్కంద ఫ్రీ రిలీజ్ ఈవెంట్ లో బాలకృష్ణ రామ్‌ను సరదాగా టీజ్‌ చేశాడు.

రామ్ మీద బాలయ్య సీరియస్‌గానే మాట్లాడాడంటూ వీడియోను వైరల్ చేస్తూ బాలయ్య‌ పై ట్రోల్స్ మొదలుపెట్టారు మెగా అభిమానులు. ఇక ప్రీ రిలీజ్ ఈవెంట్ లో రామ్, బాలయ్య ఇద్దరు సరదాగా గడిపిన సంగతి తెలిసిందే ఇలా ఇప్పుడు మెగా నందమూరి అభిమానుల ఒకరిపై ఒకరు తీవ్రంగా విమర్శలు చేసుకుంటూ తిట్టుకుంటున్నారు దీన్నిబట్టి మేఘ నందమూరి ఫ్యాన్స్ మధ్యన వారు ఎప్పటికీ కొనసాగుతూనే ఉంటుందని చెప్పకనే చెప్పారు ఫాన్స్ ఇక ఈ ఏడాది సంక్రాంతి బాక్స్ ఆఫీస్ వద్ద ఇలాంటి వాగ్వాదం చోటు చేసుకున్న వివాదాలను మనం చూశాం.