తెలుగు చిత్ర పరిశ్రమలో ప్రయోగాలకు పెట్టింది పేరు నాగార్జున.. కొత్త దర్శకులకు అవకాశాలు ఇస్తూ ఎన్నో కొత్త స్టోరీలతో ఎన్నో సినిమాలు టాలీవుడ్‌కు అందించీ ట్రెండ్ సెట్టర్గా మలిచాడు. అదేవిధంగా బాలీవుడ్ లో కూడా సినిమాలు చేసి విజయాలు అందుకున్న అతి తక్కువ మంది తెలుగు హీరోలలో నాగార్జున కూడా ఒకరు.
అలాంటి నాగార్జున హిందీలో బాలీవుడ్ బిగ్ బి అమితాబచ్చన్, శ్రీదేవి నాగార్జున కాంబినేషన్లో 1992లో రిలీజ్ అయిన బాలీవుడ్ సినిమా ఖుదా గవా ఈ సినిమా ఆ రోజుల్లోనే మంచి బ్లాక్ బస్టర్ హిట్టుగా నిలిచింది. పీరియాటికల్ డ్రామాగా తెరకెక్కిన ఈ సినిమా అప్పట్లోనే దాదాపు రూ.8 కోట్లకు పైగా భారీ బడ్జెట్ తో తెరకెక్కింది. రూ.15 కోట్లకు పైగా భారీ కలెక్షన్ రాబట్టింది.
ఈ సినిమాలో అమితాబ్ బాద్‌షా ఖాన్ అనే పాత్రలో నటించగా నాగార్జున రాజా మీర్జా అనే పోలీస్ ఆఫీసర్ గా నటించాడు. శ్రీదేవి డ్యూయల్ రోల్లో నటించింది. ఆఫ్ఘనిస్తాన్‌లో ఖుదా గవాలో షూటింగ్ చేశారు. బాలీవుడ్‌లో హిట్టైన ఈ మూవీని తెలుగులో కొండవీటి సింహం పేరుతో డబ్ చేశారు. కాగా ఈ సినిమాలో నాగార్జున పాత్రకు సాయికుమార్ డబ్బింగ్ చెప్పడం గమనార్హం. నాగార్జున సినిమాల్లో అతడి ఓన్ వాయిస్ కాకుండా మరొకరి గొంతు వినిపించే ఏకైక తెలుగు సినిమా కొండవీటి సింహం కావడం గమనార్హం. ఖుదా గవాలోనే తొలిసారి అమితాబ్ బచ్చన్‌తో కలిసి నటించారు.