బాలయ్య అభిమానులకు బ్యాట్ న్యూస్.. ఆ సూపర్ హిట్ సినిమా వాయిదా..!

నట‌సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం టాలీవుడ్ సీనియర్ హీరోలనే వరుస విజయాలతో దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆఖండా, వీర సింహారెడ్డి లాంటి బ్యాక్ టు బ్యాక్ విజయాలతో ఫుల్ ఫామ్ లో ఉన్న బాలయ్య ప్రస్తుతం హ్యాట్రిక్ విజయంపై కన్నేశాడు. స్టార్ దర్శకుడు అనిల్ రావిపూడి తో భగవంత్‌ కేసరి సినిమా చేస్తున్నాడు. ఈ సినిమా కూడా దసరా కానుక అక్టోబర్ 19న ప్రేక్షకు ముందుకు రానుంది.

ఇదే సమయంలో బాలకృష్ణ నటించిన ఆల్ టైం క్లాసికల్ సినిమాలలో భైరవద్వీపం కూడా ఒకటి. ఇప్పుడో 29 ఏళ్ల కిందట వచ్చిన ఈ సినిమాను మళ్ళీ 4k క్వాలిటీతో రీ రిలీజ్ చేయడానికి ప్లాన్ చేసిన విషయం తెలిసిందే. ఆగస్టు 30న అనగా ఈరోజు విడుదలవుతుందని అనౌన్స్ కూడా చేశారు. అయితే ఈ సినిమాకు ఆశించడమేరా అడ్వాన్స్ బుకింగ్ లేకపోవడంతో మరోసారి వాయిదా వేయాల్సి వచ్చింది.

దీంతో ఇప్పుడు ఈ మూవీ రిలీజ్‌ ఏకంగా నవంబర్‌కు వాయిదా పడింది. అడ్వాన్స్ బుకింగ్స్ చాలా దారుణంగా ఉండడంతో చిత్ర యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం టాలీవుడ్ లో వరుస సినిమాలు ప్రేక్షకుల ముందుకు రావడానికి రెడీగా ఉన్నాయి. ఈ క్రమంలోనే ఈ సినిమా రిలీజ్ అయితే కలెక్షన్ సరిగా ఉండవని భావించిన సినిమా యూనిట్ వాయిదా వేస్తున్నట్టు ప్రకటించారు. అయితే కొత్త డేట్ ను మాత్రం అనౌన్స్ చేయలేదు.