ర‌వితేజకు అంత సీన్ లేద‌రు… ప‌రువు మొత్తం తీసేసిన శ్రీలీల‌… !

ఎస్ ఇప్పుడు ఇదే విషయం టాలీవుడ్ లో బాగా వైరల్ అవుతుంది. శ్రీకాంత్ తనయుడు రోషన్ హీరోగా చేసిన పెళ్లి సందడి సినిమాకు ముందు ప్లాప్ టాక్‌ వచ్చింది. అయితే ఆ సినిమా సూపర్ హిట్ అయ్యి అందరికీ లాభాలు తీసుకువచ్చింది. దీనికి ప్రధాన కారణం ? కేవలం ఆ సినిమాలో నటించిన హీరోయిన్ శ్రీలీల అని అందరూ ఒప్పుకున్నారు. ఈ సినిమాకు ఉన్న డిస్ట్రిబ్యూటర్లు, ఎగ్జిబిటర్లు అయితే కేవలం శ్రీ లీల కోసమే ప్రేక్షకులు థియేటర్లకు వచ్చారని ఓపెన్గా ఒప్పుకున్నారు.

Dhamaka Telugu Movie Box Office Collection Day 1: Opens to a sensational  response - JanBharat Times

ఇక శ్రీ లీల రవితేజకు జోడిగా చేసిన ధమాకా సినిమా అంత పెద్ద హిట్ అయింది. ఇంకా చెప్పాలంటే రవితేజ కెరీర్ లోనే కమర్షియల్ పరంగా ఇది పెద్ద హిట్. ఈ సినిమా ఇంత పెద్ద అవ్వ‌డంలోనూ శ్రీలీల పాత్రే ఉందంటారు. అస‌లు ఈ సినిమా హీరో శ్రీలీలే అన్న ప్ర‌చారం ఇండ‌స్ట్రీలో జ‌రిగింది. ఈ ప్ర‌చారం ఖండించేందుకు ర‌వితేజ పీఆర్ టీం నానా క‌ష్టాలు ప‌డింది.

Sree Leela Knocks Down NTR After Raviteja? - Telugu Rajyam

 

అస‌లు ఈ సినిమా మామూలు సాదాసీదా సినిమా. పైగా ముస‌లి ర‌వితేజ‌లో గ‌తంలో ఉన్నంత ఎన‌ర్జీ లేదు. ఇక ఈ సినిమాకు శ్రీలీల ఎనర్జీ తో కూడిన డ్యాన్స్ లు. పాటలు, ఆ తరువాతే రవితేజ హీరోయిజం వ‌ర్క‌వుట్ అయ్యింది. స‌రే ఇప్పుడు ర‌వితేజ న‌టించిన రావ‌ణాసుర వ‌చ్చింది. ఏకంగా ఐదుగురు హీరోయిన్లు ఉన్నారు. తొలి రోజు మ‌ధ్యాహ్నంకే సినిమా వైపు చూసినోళ్లు లేరు.

Ravi Teja Biography: Movies, Photos, Videos, News, Biography & Birthday

 

మ‌రి ర‌వితేజ‌యే హీరో క‌దా ? సినిమా కుమ్మేయాలి క‌దా… అదేం లేదు. పైగా ధ‌మాకాతో పోలిస్తే రావ‌ణాసుర మంచి కంటెంట్ ఉన్న సినిమా. జ‌నాలు ప‌ట్టించుకోవ‌ట్లేదు. ధమాకా హిట్ కు కారణం శ్రీలీల అన్న‌ది ర‌వితేజ పీఆర్ టీం ఒప్పుకోక‌పోయినా జ‌నాలు మాత్రం అదే క‌రెక్ట్ అని ఒప్పుకున్నారు. ప్ర‌స్తుతం టాలీవుడ్‌లో శ్రీలీల హ‌వా న‌డుస్తోంది. ఇది న‌డిచిన‌న్ని రోజులు ఆమెకు తిరుగు ఉండ‌దు. ఇక వాల్తేరు వీర‌య్య విజ‌యం ఎవ‌రి వ‌ల్ల వ‌చ్చిందో కూడా ర‌వితేజ పీఆర్ టీంకు ప్ర‌త్యేకంగా చెప్ప‌క్క‌ర్లేదునుకుంట‌..!

Tags: film news, filmy updates, intresting news, latest news, latest viral news, Ravi Teja, social media, social media post, Star hero, telugu news, Tollywood, tollywood news, trendy news, viral news