ఒకప్పటి సీనియర్ హీరోయిన్ రచన గుర్తుందా..ఇప్పుడు ఎలా ఉందో చూస్తే మతులు పోవాల్సిందే..!

ఒకప్పటి సీనియర్ హీరోయిన్ రచన బెనర్జీ అందరికీ తెలిసే ఉంటుంది.. ఎక్కడో కోల్కతాలో జన్మించిన ఈ బెంగాలీ భామా ముందుగా ఒరియా, బెంగాలీ సినిమాల్లో నటించి ఆ తర్వాత తెలుగుతో పాటు తమిళ, కన్నడ, హిందీ సినిమాల్లో కూడా నటించింది. టాలీవుడ్ దివంగత అగ్ర దర్శకులలో ఒకరైన ఇ.వి.వి.సత్యనారాయణ దర్శకత్వంలో వచ్చిన నేను ప్రేమిస్తున్నాను సినిమాతో రచన మొదటిసారిగా టాలీవుడ్ లో అడుగు పెట్టింది. ఆ తర్వాత సీనియర్ హీరో మోహన్ బాబుతో కలిసి రాయుడు, శ్రీకాంత్‌తో పిల్లల నచ్చింది, జగపతిబాబుతో మామిడాకులు చిరంజీవితో బావగారు బాగున్నారా ఇలా చాలా సినిమాల్లో నటించి అతి తక్కువ సమయంలోనే మంచి గుర్తింపు తెచ్చుకుంది.

ఇక బాలీవుడ్ లో కూడా బిగ్ బి అమితాబ్ బచ్చన్ కు జంటగా సూర్యవంశ్ అనే సినిమాలో నటించి బాలీవుడ్ అభిమానులకు కూడా బాగా దగ్గరయింది. అలాగే ఒక ఒరియా భాషలోనే ఏకంగా 50 పైగా సినిమాలు చేయగా అందులో 40 కి పైగా సినిమాలు సిద్ధాంత్ మహాపాత్రతోనే కలిసి నటించింది. ఈ సమయంలోనే అతనితో ప్రేమలో పడింది. ఇద్దరు ఇరు కుటుంబాలను ఒప్పించి పెళ్లి కూడా చేసుకున్నారు.

అయితే పెళ్లి తర్వాత వీరి బంధం ఎంతో కాలం సాగలేదు. 2004లో విడాకులు తీసుకుని ఎవరి దారి వారు చూసుకున్నారు. తర్వాత 2007లో ప్రోబల్ బసు అనే వ్యాపారవేత్తను రెండో పెళ్లి చేసుకొని రచన ఓ మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఇక పెళ్లి తర్వాత సినిమాలకు దూరంగా ఉంటూ వచ్చిన రచన బెనర్జీ సోషల్ మీడియాలో మాత్రమం ఎంతో యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పుడు ఏదో ఒక పోస్ట్ తో తన ఫాలోవర్స్ ను, అభిమానులను అలరిస్తుంది. అంతేకాకుండా పలు బ్రాండ్స్ ను కూడా సోషల్ మీడియాలో ప్రమోట్ చేస్తూ డబ్బులు బాగా సంపాదిస్తుంది.

ఇంస్టాగ్రామ్ లో ఆమెకు దాదాపు తొమ్మిది లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇకపోతే రచన ఇప్పుడు ఎలా ఉందో చూస్తే అందరూ ఒక్కసారిగా షాక్ అవ్వక మానరు. ఎందుకంటే ఐదు పదులు వయసు వచ్చినా కూడా రచన తన గ్లామర్ మరియు ఫిట్నెస్ ఎంతో బాగా మెయింటైన్ చేస్తూ వస్తుంది. రీసెంట్ గా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న రచనా తన సెకండ్ ఇన్నింగ్స్ గురించి కూడా మాట్లాడింది. తన క్యారెక్టర్ కు ప్రాధాన్యత ఉన్న పాత్రలు వస్తే కచ్చితంగా సెకండ్ ఇన్నింగ్స్ మొదలు పెడతానని చెప్పుకొచ్చింది. అలాగే టాలీవుడ్ లో నేటితరం హీరోలలో అల్లు అర్జున్, రామ్ చరణ్ అంటే తనకు ఇష్టమని అలాగే ఎన్టీఆర్ డాన్స్ కు తాను వీర అభిమానిని చెప్పుకొచ్చింది.

 

 

View this post on Instagram

 

A post shared by Rachna Banerjee (@rachnabanerjee)