బాలకృష్ణ- భూమిక కాంబినేషన్లో మిస్సయిన బ్లాక్ బస్టర్ మూవీ ఇదే..!

ఇక మన చిత్ర పరిశ్రమలో ఒక హీరో చేయాల్సిన సినిమాను మరో హీరో చేసి హిట్ కొట్టడం ఎంతో కామన్ గా జరుగుతూ ఉంటుంది. అలాగే కొన్ని అరుదైన కాంబినేషన్లు కూడా మిస్ అవుతూ ఉంటాయి.. ఉదాహరణకు పవన్ కళ్యాణ్- నయనతార, పవన్- అనుష్క కాంబినేషన్లో సినిమాలు ఇప్పటికీ రాలేదు. ఈ క్రేజీ కాంబినేషన్ కోసం టాలీవుడ్ ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా కొన్ని సంవత్సరాల నుంచి ఎదురు చూస్తున్నారు. వారు ఆశలు మాత్రం నెరవేరటం లేదు.

ఇక నందమూరి బాలకృష్ణ- భూమిక కాంబినేషన్లో ఓ సూపర్ హిట్ సినిమా మిస్సయింది. బాలయ్య ఈ సినిమా చేసేందుకు ఓకే చెప్పి ఉంటే వీరిద్దరి కాంబినేషన్లో వచ్చిన బ్లాక్ పోస్టర్ హిట్ సినిమాగా ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయేది. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు సింహాద్రి.. దర్శక దీరుడు రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా 2003లో ప్రేక్షకుల‌ ముందుకు వచ్చిన సింహాద్రి సినిమా ఎంత పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసింది.

ఇక సినిమా కథ ముందుగా రెడీ చేసిన రచయిత విజయేంద్ర ప్రసాద్ ముందుగా బాలకృష్ణకు చెప్పారట. బాలయ్య హీరోగా రాజమౌళి దర్శకత్వంలో ఈ సినిమా చేయాలని అనుకున్నారు. అప్పటికే బాలయ్య చాలా ఫ్యాక్షన్ కథ‌లతో సినిమాలు చేసి ఉండటం.. అదే టైంలో బి.గోపాల్ దర్శకత్వంలో పలనాటి బ్రహ్మనాయుడు లాంటి ఫ్యాక్షన్‌ సినిమాలో నటిస్తూ ఉండటంతో మళ్ళీ వెంటనే మరో ఫ్యాక్షన్ సినిమా చేస్తే బాగోదేమో అని నో చెప్పారట. ఈ సినిమాలో అప్పటికి హీరోయిన్‌గా భూమికను తీసుకోవాలని రాజమౌళి ఫిక్స్ అయ్యారు.

బాలయ్య- భూమిక కాంబినేషన్ అయితే బాగుంటుందని కూడా ఆయన అనుకున్నారు. ఎప్పుడైతే బాల‌య్య నో చెప్పారో అదే కథ‌తో ఎన్టీఆర్ హీరోగా సింహాద్రి సినిమా తీసి బ్లాక్ బస్టర్ హీట్ అందుకున్నాడు. సింహాద్రిలో మరో హీరోయిన్‌గా అంకిత నటించారు. అయితే అంకిత- భూమిక బాలయ్యతో కలిసి నటించారు.. బాలయ్య హీరోగా వచ్చిన విజయేంద్ర వర్మ సినిమాలో అంకిత హీరోయిన్‌గా నటించగా.. ఇక చాలా ఏళ్లు తర్వాత బాలయ్య రూలర్ సినిమాలో భూమిక‌ నటించింది. అయితే బాలయ్య సినిమాలో భూమిక హీరోయిన్గా కాదు.. సినిమాకు మలుపు తిప్పే కీలకపాత్రలో ఆమె నటించింది. ఈ విధంగా బాలయ్య భూమిక కాంబినేషన్లో సూపర్ హిట్ సినిమా మిస్ అయింది అని చెప్పాలి.