Rashmika : పాపం రష్మిక.. ఇలా జరుగుతుందని అసలు ఊహించలేదు..!

SeethaRamam Result Shock to Rashmika Mandanna Mrunal Thakur Performance

కన్నడ భామ రష్మిక మందన్నకి ఊహించని షాక్ తగిలింది. సోలో హీరోయిన్ గా ఓ పక్క సత్తా చాటుతున్న అమ్మడు పాత్ర ప్రాధాన్యత ఉండటంతో సీతారాం సినిమాలో నటించింది. సినిమాలో ఆమె అఫ్రీన్ పాత్రలో కనిపించింది. వరుస సూపర్ హిట్లతో టాలీవుడ్ ని ఊపేస్తున్న రష్మిక సీతారామం సినిమాలో తన పాత్ర హైలెట్ అవుతుందని భావించింది. సినిమాలో రష్మిక పాత్రని సీత పాత్ర చాలా డామినేట్ చేసింది.

సీతారామం సినిమాలో సీత పాత్ర చేసింది బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్. తెలుగులో ఆమెకి ఇదే మొదటి సినిమా. అసలు అంతకుముందు ఆమె మన ఆడియెన్స్ కి తెలియదు కూడా. సీతారామం సినిమాలో రష్మిక (Rashmika) పాత్ర హైలెట్ గా నిలుస్తుందని అనుకోగా సీత పాత్రతో ఆడియెన్స్ ని కట్టిపడేసింది మృణాల్ ఠాకూర్. ఆమె అభినయానికి ఆడియెన్స్ ఫిదా అయ్యారు.

దుల్కర్ సల్మాన్, మృణాల్ ల కెమిస్ట్రీ సూపర్ గా వర్క్ అవుట్ అయ్యింది. ఇక డైరక్టర్ గా హను రాఘవపుడి ఈ సినిమాతో మరో మెట్టు ఎక్కేశాడని చెప్పొచ్చు. సీతారామం సినిమా చేయడం వల్ల కెరియర్ లో ఓ హిట్ వేసుకుంది రష్మిక (Rashmika) అయితే సినిమా హిట్ లో మాత్రం ఆమె కన్నా మృణాల్ కే ఎక్కువ మార్కులు వేస్తున్నారు ఆడియెన్స్.

Tags: Dulquer Salman, Hanu Raghavapudi, Mrunal Thakur, Rashmika, Rashmika Mandanna, Seetharamam, Tollywood