Krithi Shetty : డోస్ పెంచుతున్న బేబమ్మ.. నడుము అందాలతో ఆడియెన్స్ ఉక్కిరి బిక్కిరి..!

Krithi Shetty

ఉప్పెన సినిమాతో సూపర్ క్రేజ్ తెచ్చుకున్న కృతి శెట్టి  (Krithi Shetty) ఆ క్రేజ్ తో వరుస సినిమాలతో దూసుకెళ్తుంది. ఈ ఇయర్ ఆల్రెడీ బంగార్రాజు సినిమాతో హిట్ అందుకున్న కృతి శెట్టి ఈమధ్యనే రామ్ తో ది వారియర్ అంటూ వచ్చి జస్ట్ ఓకే అనిపించుకుంది. ఆ సినిమాలో అమ్మడు గ్లామర్ రోల్ లో కనిపించింది. ఇక లేటెస్ట్ గా నితిన్ తో మాచర్ల నియోజకవర్గం సినిమాలో నటిస్తుంది కృతి. ఈ సినిమాలో కూడా అమ్మడు గ్లామర్ డాల్ గా రెచ్చిపోతుంది.

సినిమా నుంచి లేటెస్ట్ గా ఓ సాంగ్ రిలీజ్ కాగా ఆ సాంగ్ లో నడుము అందాలతో ఆడియెన్స్ ని ఉక్కిరి బిక్కిరి చేస్తుంది కృతి శెట్టి (Krithi Shetty). వచ్చిన క్రేజ్ కి తన గ్లామర్ కూడా యాడ్ చేసి వరుస అవకాశాలు పొందాలని చూస్తుంది. అయితే సినిమాలు వస్తున్నాయి కదా అని ఏది పడితే అది చేయకుండా ఆచి తూచి అడుగులేస్తే బెటర్. రామ్ ది వారియర్ ఎలాగు నిరాశపరచింది నితిన్ మాచర్ల నియోజకవర్గం కూడా అటు ఇటైతే అమ్మడి కెరియర్ రిస్క్ లో పడినట్టే.

అందుకే ముందుగానే తనలోని ఈ గ్లామర్ యాంగిల్ తో ఆడియెన్స్ ని తన బుట్టలో పడేయాలని చూస్తుంది కృతి శెట్టి. నితిన్ సినిమా తర్వాత సుధీర్ తో చేస్తున్న ఆ అమ్మాయి గురించి మీకు చెప్పాలి సినిమా కూడా లైన్ లో ఉంది. ఆ సినిమా లో కృతి శెట్టికి పర్ఫార్మెన్స్ స్కోప్ ఉన్న పాత్ర అని తెలుస్తుంది.

Tags: Bangarraju, Krithi Shetty, Krithi Shetty Updates, Macharla Niyojakavargam, Nitin, the warrior