Aakanksha Singh : పెళ్లైనా సరే తగ్గేదేలే.. గ్లామర్ డాల్ గా ఆకాంక్ష సింగ్..!

Aakanksha Singh Glamour Show

మళ్లీ రావా సినిమాతో మెప్పించిన ఆకాంక్ష సింగ్ ఆ సినిమాతో మంచి నటిగా పేరు తెచ్చుకుంది. సుమంత్ సరసన నటించి హిట్ అందుకున్న ఈ అమ్మడికి టాలీవుడ్ లో పెద్దగా అవకాశాలు రాలేదు మళ్లీ రావా తర్వాత కింగ్ నాగార్జున నాని కలిసి నటించిన మల్టీస్టారర్ దేవదాస్ సినిమాలో నటించి మెప్పించింది ఆకాంక్ష సింగ్. పెళ్లైనా సరే గ్లామర్ విషయంలో తగ్గేదేలే అంటుంది ఆకాంక్ష అందుకే తన హాట్ ఫోటో షూట్ తో కుర్రాళ్లని తెగ డిస్ట్రబ్ చేస్తుంది.

తెలుగులో కన్నా తమిళ, కన్నడ, హిందీ భాషల్లో సినిమాలు చేస్తుంది ఆకాంక్ష సింగ్. ప్రస్తుతం తెలుగులో క్లాప్ సినిమా చేస్తున్న ఆకాంక్ష (Aakanksha Singh) తమిళంలో వీర పాండియన్ సినిమా చేస్తుంది. హిందీలో కూడా రన్ వే 34 సినిమాలో నటిస్తుంది. నాని నిర్మాతగా తన సోదరి దీప్తి డైరక్షన్ లో వస్తున్న మీట్ క్యూట్ సినిమాలో ఆకాంక్ష సింగ్ నటిస్తుంది.

పెళ్లైనా సరే పాత్ర కోసం గ్లామర్ షో చేసేందుకు రెడీ అంటుంది ఆకాంక్స సింగ్. అందుకు శాంపిల్ గా తన హాట్ ఫోటో షూట్స్ తో అలరిస్తుంది (Aakanksha Singh) అమ్మడు. లేటెస్ట్ గా అమ్మడు తన సోషల్ మీడియాలో షేర్ చేసిన గ్లామర్ పిక్స్ వైరల్ గా మారాయి. చూస్తుంటే అమ్మడు కూడా లిప్ లాక్, ఇంటిమేట్ సీన్స్ కి సై అనేలానే ఉందని చెప్పొచ్చు.

Tags: Aakanksha, Aakanksha Singh, Devadas, Malli Rava, Meet Cute, nagarjuna, Tollywood