Seetharamam : సీతారామం డిలీటెడ్ సీన్ చూశారా.. ఓ లుక్కేయండి..!

Seetharamam Deleted Scene Released Dulquer Salmna Sumanth

Seetharamam : హను రాఘవపుడి డైరక్షన్ లో దుల్కర్ సల్మాన్, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన సినిమా సీతారామం. సక్సెస్ ఫుల్ గా 50 రోజులు పూర్తి చేసుకున్న సందర్భంగా చిత్రయూనిట్ మూవీ నుంచి ఓ డిలీటెడ్ సీన్ ని రిలీజ్ చేసింది. పాక్ సైనికుల చేతుల్లో బందీగ ఉన్న దుల్కర్, సుమంత్ లకు అక్కడ ఒక ఆఫీసర్ మీరు ఏం చేయాలనుకుంటే అది చేయండి అని చెబుతాడు. ఆ టైం లో ఇద్దరిని ఫుట్ బాల్ ఆడిస్తారు.

ఆ టైం లో సుమంత్ వచ్చి దుల్కర్ మీద కూర్చుని కొడతాడు. ఆ తర్వాత ఇద్దరిని పాక్ సైనికులు తీసుకెళ్లబోతారు. ఈ సీన్ సినిమాకు అంత అవసరం లేదు అనుకున్నారో ఏమో ఎడిటింగ్ లో కట్ చేశారు. అయితే సీతారామం సినిమాలో ఈ సీన్స్ కన్నా రామ్, సీతల మధ్య ఏమైనా సీన్స్ కట్ చేస్తే అవి రిలీజ్ చేయండి అని ఫ్యాన్స్ కోరుతున్నారు.

సినిమాలో సీత పాత్ర చేసిన మృణాల్ కి సూపర్ ఫాలోయింగ్ వచ్చింది. సినిమాకు విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ కూడా సినిమాకు ప్రాణం అయ్యింది. ఈమధ్యనే ఓటీటీలో రిలీజైన ఈ సినిమా ఓటీటీ ఆడియన్స్ ని కూడా మెప్పిస్తుంది. హను రాఘవపుడి ఇంతకుముందు సినిమాలు ఫ్లాప్ అవగా తాను కూడా కమర్షియల్ హిట్ కొడతా అని ఈ మూవీతో ప్రూవ్ చేసుకున్నాడు. తప్పకుండా హనుని ఈ విషయంలో అప్రిషియేట్ చేయాల్సిందే.

Tags: Dulquer Salman, Mrunal Thakur, Seetharamam, Seetharamam Deleted Scenes, Sumanth, vyjayanthi movies