BiggBoss 6 : కెప్టెన్ గా ఆదిరెడ్డి.. పర్ఫెక్ట్ గా గ్రాఫ్ పెంచుకుంటున్నాడు..!

BiggBoss 6 : బిగ్ బాస్ సీజన్ 6 కెప్టెన్ గా బిగ్ బాస్ రివ్యూయర్ ఆది రెడ్డి నిలిచాడు. 3వ వారం కెప్టెన్సీ పోటీలో భాగంగా ఆది రెడ్డి తో పాటుగా శ్రీహాన్, శ్రీ సత్య ఫైనల్ టాస్క్ లో పాల్గొనగా ఆది రెడ్డి ఆ టాస్క్ లో గెలిచాడు. సో ఈ వారం ఇంటి కెప్టెన్ గా ఆది రెడ్డి నిలిచాడు. బిగ్ బాస్ రివ్యూస్ ద్వారానే సోషల్ మీడియాలో ఓ రేంజ్ పాపులారిటీ తెచ్చుకున్న ఆది రెడ్డి బిగ్ బాస్ ద్వారా క్రేజ్ తెచ్చుకుని బిగ్ బాస్ హౌజ్ కి వెళ్లాడు.

ఒక రివ్యూయర్ గా టాస్కుల గురించి చెప్పి చెప్పి అలవాటు పడ్డాడు కాబట్టి హౌజ్ లో ఆటని కూడా అదే విధంగా ఆడుతున్నాడు. అయినంతవరకు అతను తన బెస్ట్ ఇవ్వాలని ప్రయత్నిస్తున్నాడు. బిగ్ బాస్ సీజన్ 6 లో వన్ ఆఫ్ ది స్ట్రాంగ్ కంటెస్టంట్ గా ఆది రెడ్డి తనని తాను ప్రూవ్ చేసుకుంటున్నాడని చెప్పొచ్చు. అంతేకాదు వారం వారం తన గ్రాఫ్ పెంచుకుంటూ వెళ్తున్నాడు.

3వ వారం కెప్టెన్ కాబట్టి 4వ వారం నామినేషన్స్ లో ఉండే ఛాన్స్ లేదు. సో ఇంకాస్త బెటర్ పర్ఫార్మెన్స్ ఇచ్చే ఛాన్స్ ఉంటుంది. కామన్ మెన్ గానే అయినా బిగ్ బాస్ వాళ్లు అతను కూడా సెలబ్రిటీ అన్నట్టుగానే హౌజ్ లోకి పంపించారు. అతని ఆట తీరు చూస్తుంటే ఖచ్చితంగా ఈ సీజన్ లో ఆది రెడ్డి తన మార్క్ చూపించేలా ఉన్నాడు. కెప్టెన్ అవగానే బిగ్ బాస్ హౌజ్ లో ఆది రెడ్డి చాలా ఎమోషనల్ అయ్యాడు.

Tags: Aadi Reddy, BB6, BiggBoss, BiggBoss6, Star Maa