సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన ఈ ముద్దుగుమ్మ ని….. గుర్తుపట్టారా…!

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమా అందరికీ గుర్తుండే సినిమా. ఈ చిత్రంలో మహేష్ బాబు, వెంకటేష్ హీరోలుగా నటించారు. ఈ సినిమా ఎన్నో అంచనాల మధ్య విడుదలై బాక్సాఫీస్ వద్ద సైప‌ర్ హిట్ అయింది. ఈ చిత్రంలో మహేష్ బాబు, వెంకటేష్ మధ్య అన్నదమ్ముల అనుబంధాన్ని చక్కగా చూపించారు. ఈ చిత్రంలో మహేష్ బాబు లవర్ బాయ్ గా కనిపించాడు. అయితే ఈ సినిమాలో మహేష్ బాబు రైల్వే స్టేషన్ లో ఉన్నప్పుడు తన వెంట ఓ అమ్మాయి మాట్లాడుతూ వస్తుంది.

ఈ సినిమాలో ఆ అమ్మాయి కనిపించింది కొంతసేపే అయినప్పటికీ చాలా ఫేమస్ అయ్యింది. ఆ ముద్దుగుమ్మ‌ పేరు సుప్రియ ఐసోలా. టాలీవుడ్ లో పలు చిత్రాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటించింది. ఈ అమ్మాయి “బాబు బాగా బిజీ” చిత్రంలో బోల్డ్ క్యారెక్టర్ లో నటించి అందరికీ షాక్ ఇచ్చింది. ఆ సినిమా అనంతరం ఈమెకు తెలుగులో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో బాలీవుడ్ వైపుకు వెళ్ళింది.

బాలీవుడ్లో పలు చిత్రాల్లో నటిస్తూ అక్కడే స్థిరపడింది. ఇక సుప్రియ ఈ మధ్యకాలంలో వచ్చిన రాన నాయుడు వెబ్ సిరీస్ లో ఒక కీలక పాత్రను వహించింది. ఈ వెబ్ సిరీస్లో ఈ భామని చూసి సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో నటించిన ఈ అమ్మాయేనా అంటూ ఆశ్చర్యపోతున్నారు.