ఆర్తి అగర్వాల్ కన్ను మూయడానికి…. అసలు కారణం ఇదే…!!

తెలుగు ఇండస్ట్రీలో ఒకప్పుడు తన అంద చందాలతో అదరగొట్టిన హీరోయిన్ ఆర్తి అగర్వాల్ అంటే తెలియని వారు ఉండరు. అలాంటి ఆర్తి అగర్వాల్ సినిమా ఇండస్ట్రీలో మంచి పొజిషన్లో ఉండగానే అర్ధాంతరంగా తన జీవితాన్ని నాశనం చేసుకుంది. 2001లో నువ్వు నాకు నచ్చావ్ అనే సినిమాతో తెలుగు లో ఎంట్రీ ఇచ్చిన ఆర్తి అగర్వాల్ ఇంద్ర, అల్లరి రాముడు, నీ స్నేహం, నువ్వు లేక నేను లేను, వసంతం వంటి అనేక సినిమాల్లో నటించి స్టార్ హీరోయిన్ గా ఎదిగింది.

ఆ తరువాత నువ్వు లేక నేను లేను సినిమా ద్వారా తరుణ్- ఆర్తి అగర్వాల్ మధ్య బంధం కలిసింది. దీనితో ఇద్దరి మధ్య ప్రేమ పుట్టింది. ఇక 2003 నుంచి ఇద్దరూ ఒకే ఇంట్లో ఉండటం మొదలుపెట్టారు. ఇద్దరూ ఇండస్ట్రీలో చిలకా గోరింకల్లా తిరిగారు. ఈ తరుణంలో వీరిద్దరూ వివాహం చేసుకోబోతున్నారని అనేక వార్తలు వచ్చాయి. ఈ తరుణంలోనే ఆర్తి అగర్వాల్ ప్రెగ్నెంట్ అయ్యి అబార్షన్ కూడా అయిందని అప్పట్లో ఓ వార్త‌ కూడా వినిపించింది. అయినా తరుణ్ ఆమెని వివాహం చేసుకోలేదు. దీనికి ప్రధాన కారణం లైఫ్ లో సెట్ అయిన తర్వాత చేసుకుందాం అనుకున్నారట.

కానీ ఆర్తి అగర్వాల్ మాత్రం తరుణ్ ప్రేమలో పూర్తిగా మునిగిపోయింది. ఇక ఆమె సినిమాలు ఆపేసి పెళ్లి చేసుకుందామని తరుణ్‌ను పోర్స్‌ చేసిందట. ‌కానీ తరుణ్ మాత్రం కెరీర్‌లో సక్సెస్ అయిన తరువాతే పెళ్లి అని చెప్పాడట. కానీ ఆర్తి అగర్వాల్ ప‌ట్టు పట్టడంతో ఆమె తల్లిదండ్రులు వచ్చి రోజా రమణి తో మాట్లాడారు. రోజా రమణి ఆర్తి అగర్వాల్ ని తప్పు బట్టి ఆమె క్యారెక్టర్ బ్యాట్ చేసింది. చివరికి తరుణ్‌ని కూడా అడిగారట. తరుణ్ కూడా మా అమ్మ చెప్పిన మాటే మాకు వేదం అని చెప్పాడట. దీంతో డిప్రెషన్ లోకి వెళ్లిన ఆర్తి అగర్వాల్ రెండు సార్లు సూసైడ్ చేసుకుంది.

కానీ ఆ గండం నుంచి బయటపడింది. ఇక ఈ బాధలు తట్టుకోలేక ఆర్తి అగర్వాల్ తల్లిదండ్రులు ఆమెను అమెరికాకి తీసుకువెళ్లి ఒక వ్యక్తితో పెళ్లి చేశారట. అయినా ఆర్తి- తరుణ్ ప్రేమను మర్చిపోలేక ఆయనకు ఒక వన్ ఇయర్ లోపే విడాకులు ఇచ్చేసిందట. ఇక తర్వాత సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ చేయాలని అనుకుందట. కానీ ఆమె డిప్రెషన్ లోకి వెళ్లడం వల్ల ఆస్తమా వచ్చి లావయిందట. లావుగా ఉండడం వల్ల ఎవరు అవకాశాలు ఇవ్వకపోవడంతో ఆమె సన్నబడడానికి ఆపరేషన్ చేయించుకుంటే అది వికటించి 2015లో కన్నుమూసింది.