చిరంజీవి కొత్త సినిమా కోసం ఉపాస‌న ఏం చేసిందో చూడండి…!

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో ప్రేక్షకుల‌ ముందుకు వస్తున్నాడు. ఇప్పటికే ఈ సంక్రాంతికి వాల్తేరు వీర‌య్య‌ తో వచ్చి బంపర్ హిట్ అందుకున్న చిరు ఇప్పుడు భోళా శంకర్‌తో ఈ నెల 11న థియేటర్లో సందడి చేయబోతున్నాడు. ఈ సినిమా తర్వాత కూడా తన నెక్స్ట్ మూవీ యువ దర్శకుడు కాల్యాణ్ కృష్ణ‌తో చేయబోతున్నట్టు తెలుస్తుంది. అదేవిధంగా ఈ సినిమాను చిరు పెద్ద కూతుడు సుష్మిత‌ నిర్మాతగా వ్యవహరిస్తుందని అంటున్నారు.

అయితే ఇప్పుడు ఈ సినిమా గురించి ఓ ఇంట్రెస్టింగ్ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆ వార్త ఏమిటంటే ఈ సినిమాను మలయాళంలో సూపర్ హిట్ అయిన బ్రో డాడీకి రీమేక్‌గా తెర్కెక్కించుకున్నారట. అదేవిధంగా ఈ సినిమాకు సంబంధించి మెగా కోడలు ఉపాసన కూడా మామ గారికి అదిరిపోయే సర్ప్రైజ్ ఇవ్వనున్నట్టు తెలుస్తుంది. సర్ప్రైజ్ ఏమిటంటే చరణ్- ఉపాసనలకు స్నేహితుడైన శర్వానంద్‌ ఈ సినిమాలో చిరంజీవికి కొడుకుగా నటించబోతున్నాడట.

అదేవిధంగా మరో సీనియర్ హీరోయిన్ త్రిష కూడా సుమారు 23 సంవత్సరాల తర్వాత చిరంజీవితో జతకట్టబోతుంది. అదే విధంగా యంగ్ హీరోయిన్ శ్రీలీల- శర్వానంద్ కు జంటగా నటించబోతుందని అంటున్నారు. ఈ సినిమాకు సంబంధించిన అధికార ప్రకటనను ఈ నెల 22న చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా అనౌన్స్ చేయనున్నారట. మరి కాల్య‌ణ్‌ కృష్ణ ఈ సినిమాతో చిరంజీవికి ఎలాంటి విజయం ఇస్తారో చూడాలంటే మరికొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే.