ఫ‌స్ట్ 3 బంతుల్లో 2 సిక్సులు… ఇది తెలుగోడు తిల‌క్‌వ‌ర్మ మైండ్ బ్లోయింగ్‌ ఎంట్రీ ( వీడియో)

టీమిండియా యువ‌ ఆటగాడు హైదరాబాదీ తిలక్ వర్మ అరంగేట్రంలోనే అదుర్స్ అనిపించాడు. అంతర్జాతీయ క్రికెట్‌లో తన ఆగమనాన్ని ఘనంగా చాటడమే కాకుండా.. మిడిలార్డర్‌లో టీమిండియాను మరో రైనా మాదిరిగా ఆదుకున్నాడు. శుబ్‌మాన్ గిల్, ఇషాన్ కిషన్, హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్ లాంటి హార్డ్ హిట్టర్లు విఫలమైన వేళ.. తిలక్‌వర్మ తనదైన శైలి బ్యాటింగ్‌తో ప్రత్యర్ధి బౌలర్ల భరతం పట్టడమే కాకుండా.. టీంలో టాప్ స్కోరర్‌గా నిలిచాడు.

వన్డేల్లో తొలి మ్యాచ్ ఆడిన ఈ హైదరాబాద్ బ్యాట్స్‌మెన్ ఏమాత్రం జంకకుండా.. ఎదుర్కున్న రెండో బంతినే సిక్స్‌గా మలిచాడు. అలా తోలీ మూడు బంతిలోనే రెండు సిక్స్‌లు కొట్టి అద‌ర‌గోట్ట‌డు. ఇక దింతో అత‌న్ని బ్యాటింగ్ చూసిన నెటిజ‌న్ల‌ను బార‌త్‌కు మ‌రో యువరాజ్, రైనా దొరికాడు అంటూ సోషల్ మీడియాలో కామెంట్లు చేస్తున్నారు. ఆ మ్యాచ్లో ఓవరాల్ గా తిలాక్ 22 బంతుల్లో రెండు ఫోర్లు, 3 సిక్సర్లతో 39 పరుగులు చేశాడు.

ఇక నిన్న జరిగిన టీమ్ ఇండియా బ్యాటింగ్ లైనప్‌లో తిలక్ దే టాప్ స్కోరుగా నిలిచింది. ఇప్పుడు అతడి బ్యాటింగ్ కి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. చివరి ఓవర్‌లో టీమిండియా విజయానికి 10 పరుగులు కావాల్సి ఉండగా.. కుల్దీప్ యాదవ్ మొదటి బంతికి ఔట్ అయ్యాడు. ఆ తర్వాత ముఖేష్ కుమార్, చాహల్.. 5 బంతులకు 5 పరుగులే సాధించగలిగారు. దీంతో భారత్ 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది.