ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ హీరోగా, జాన్వీ కపూర్ హీరోయిన్‌గా కొరటాల శివ దేవర సినిమాను రూపొందిస్తున్న సంగతి. తెలిసిందే ఈ సినిమాపై ప్రేక్షకుల్లో భారీ అంచనాలు ఉన్నాయి. ఈ సినిమాను ఎలాగైనా సోలోగా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సెస్ సాధించాలని ఎన్టీఆర్ గట్టిగానే నిర్ణయించుకున్నాడు. ఈ సినిమా కోసం ఎంతగానో హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఇక ఈ సినిమా స్క్రిప్ట్ విషయంలో చాలా చర్చలు జరిగిన తర్వత షూటింగ్ స్టార్ట్ అయింది.
ఈ సినిమాకు దర్శకుడు కొరటాల శివ అయినా కూడా ఏదైనా సరే ఎన్టీఆర్ ఫైనల్ చేసిన తర్వాతనే షార్ట్ ఓకే అవుతున్నట్లుగా తెలుస్తోంది. ప్రస్తుతం హైదరాబాదులో ప్రత్యేకమైన సెట్ లో సముద్రానికి సంబంధించిన సీన్స్ షూటింగ్ జరగబోతుందని.. హాలీవుడ్ టెక్నీషియన్స్ తో విజువల్ ఎఫెక్ట్స్ టీం కూడా ఈ సినిమా కోసం హార్డ్ వర్క్ చేయబోతున్నారని తెలుస్తోంది. ఇక పర్ఫెక్ట్ షాట్ వచ్చిన తర్వాత జూనియర్ ఎన్టీఆర్ ఓకే చెస్తున్నాడట. ఈ సినిమాలో సముద్రంపై ఓ భారీ యాక్షన్ సీన్ షూటింగ్ జరగబోతుందని ఈ సీన్ సినిమాకి హైలెట్ కాబోతుందని తెలుస్తుంది.
పూర్తిస్థాయిలో కాన్ఫిడెంట్‌గా అనిపించే వరకు జూనియర్ ఎన్టీఆర్ ఏమాత్రం తగ్గడం లేదట. కొరటాల శివ కొన్ని కొన్ని షాట్స్ ఓకే చేసిన జూనియర్ ఎన్టీఆర్‌కి నచ్చకపోతే మరొక షాట్ చేయడానికి రెడీ అవుతున్నాడట. ఎన్టీఆర్‌కి కూడా షాట్ నచ్చితే గాని ఫైనల్ అవ్వడం లేదని తెలుస్తుంది. మరి ఇన్ని జాగ్రత్తలు తీసుకుంటున్న జూనియర్ ఎన్టీఆర్ దేవరా సినిమాలతో ఏ రేంజ్ లో సక్సెస్ అందుకుంటాడో చూడాలి.