స్టార్ హీరోయిన్ అనుష్క శెట్టి చాలా కాలం గ్యాప్ తర్వాత యంగ్ హీరో నవీన్ పోలాశెట్టితో జంటగా వెండితెరపై కనిపించబోతుంది. మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి సినిమాతో ప్రేక్షకులను అలరించబోతుంది. వంశీ, ప్రమోద్ నిర్మించిన ఈ సినిమా ఈ రోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇక సినిమా ప్రమోషన్స్ లో భాగంగా నవీన్ పోలిశెట్టి రెండు రాష్ట్రాల్లో పలు ప్రదేశాల్లో సందడి చేసిన సంగతి తెలిసిందే. అనుష్క మాత్రం సినిమాల్లో ప్రమోషన్స్‌లో పాల్గొనటంలేదంటే పలు వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇక తాజాగా సినిమా ప్రమోషన్స్ లో అనుష్క కూడా భాగమైంది.
వినూత్నంగా సినిమాను ప్రమోట్ చేస్తూ అందరి దృష్టిని ఆకర్షించుకుంది. ఈసారి అనుష్క కోసం ప్రభాస్ రంగంలోకి దిగాడు. అనుష్క సినిమా కోసం ఆయన చేసిన ఓ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఇక ఈ సినిమాలో అనుష్క చెఫ్ గెటప్ లో కనిపించిన సంగతి తెలిసిందే. దీంతో తాజాగా అనుష్క ఒక వీడియో సోషల్ మీడియాలో షేర్ చేసుకుంటూ.. తనకు ఇష్టమైన వంటకం అయిన మంగళూరు చికెన్, నీర్ దోసే ఎలా చేయాలో తయారీ విధానం అభిమానులతో పంచుకుంటూ.. చెఫ్ పాత్రలో చేయడం నాకు ఇదే తొలిసారి ఇది నా బెస్ట్ మూవీ గా ఫీల్ అవుతున్నాను అంటూ షేర్ చేసుకుంది.
ఇందులో భాగంగా ఒక కొత్త ఛాలెంజ్‌ను మొదలు పెడుతున్నా అంటూ ఆ ఛాలెంజ్‌ను ప్రభాస్‌కు విసిరింది. భోజనాన్ని అంతగా ఇష్టపడే వ్యక్తి ఆయన.. ఇప్పుడు తనకు ఇష్టమైన వంటకాన్ని ఎలా తయారు చేస్తారు ఆయన పోస్ట్ పెట్టాలి అంటు ప్రభాస్‌ని ట్యాగ్ చేసింది అనుష్క. సినిమా ప్రమోషన్‌లో భాగమయ్యాడు. రొయ్యల పలావ్ అంటే తనకు ఎంత ఇష్టమని దాని తయారి విధానం గురించి వివరించాడు. ఆ తర్వాత చాలెంజ్ గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ కు విసురుతున్నట్లు ప్రభాస్ చెప్పాడు. ఇలా ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ ఛాలెంజ్ ట్రెండింగ్ అవుతుంది. దీంతో ప్రభాస్ ఫ్యాన్స్ కూడా పోస్ట్‌ను నెట్టింట తెగ షేర్ చేస్తున్నారు.