‘ మిస్ శెట్టి… మిస్ట‌ర్ పోలిశెట్టి ‘ రివ్యూ.. అనుష్క కం బ్యాక్‌

నవీన్ పోలిశెట్టి – అనుష్క జంటగా నటించిన ఫ్యామిలీ ఎంటర్టైనర్ మిస్‌శెట్టి.. మిస్టర్ పోలిశెట్టి. పి మహేష్ బాబు దర్శకత్వం వహించిన ఈ సినిమాను యూవీ క్రియేషన్స్ వారు నిర్మించారు. జాతీరత్నాలు లాంటి బ్లాక్ బస్టర్ తర్వాత నవీన్… దాదాపు 5 ఏళ్ల గ్యాప్ తీసుకుని సీనియర్ హీరోయిన్ అనుష్క నటిస్తున్న సినిమా కావడంతో మిస్‌శెట్టి మిస్టర్ పోలిశెట్టిపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. దీనికి తోడు టీజర్, ట్రైలర్లు చూశాక అంచనాలు మరింత పెరిగాయి. ప్రమోషన్లు కూడా వెరైటీగా చేయడంతో ఈ మూవీపై పాజిటివ్ బ‌జ్ క్రియేట్‌ అయింది.

ఇక మెగాస్టార్ చిరంజీవి కూడా ముందుగానే సినిమా చూసి అదిరిపోయింది అంటూ రివ్యూ ఇవ్వడంతో ప్రేక్షకుల్లో కూడా ఆసక్తి పెరిగింది. ఇప్పటికే ప‌లుచోట్ల ఫస్ట్ డే ఫస్ట్ షో పడిపోయింది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా వేదికగా తమ అభిప్రాయం చెబుతున్నారు. సోషల్ మీడియాలో ఈ సినిమాకు పాజిటివ్ టాక్ వస్తోంది. సినిమా బాగుందని.. నవీన్ కామెడీ అదిరిపోయింది అని అంటున్నారు.

అనుష్కకు బ్యాక్ మూవీ ఇది అని అంటున్నారు. ఇప్పుడే లండన్ లో సినిమా చూశాను.. ఒక్కమాటలో చెప్పాలంటే వెరీ నైస్ సినిమా చాలా బాగుంది.. నవీన్ పోలిశెట్టి కామెడీ టైమింగ్ యాక్టింగ్ అద్భుతం.. అనుష్కకు ఇది మంచి కం బ్యాక్‌ సినిమా అంటూ కామెంట్ చేశాడు. మిస్‌సెట్టి మిస్టర్ పోలిశెట్టి ఎమోషనల్ తో కూడిన క్లీన్ కామెడీ సినిమా.. అనుష్క ఎప్పటికీ రాణిలాగే ఉంటుంది.. నవీన్ కామెడీ చాలా బాగుంది అంటూ ఒక నెటజ‌న్ ట్విట్ చేశాడు.

ఇక రేటింగ్ కూడా చాలా మంది 2.75 నుంచి 5 వరకు ఇస్తున్నారు. సినిమాకి అయితే ఓవ‌రాల్‌గా పాజిటివ్ బజ్‌ అయితే కనిపిస్తోంది. ఇక చాలా రోజుల తర్వాత అనుష్క తెరమీద కనిపించటం కూడా ఈ సినిమాకు ప్లస్ కానుంది ఏది. ఏమైనా అనుష్క అదిరిపోయే హిట్ తమ ఖాతాలో వేసుకున్నారు. మరి పూర్తి రివ్యూ తో ఈ సినిమా ఫలితం ఎలా ఉంటుందో మరి కొద్ది గంటల్లో తేలిపోనుంది.