కొణిదల శివశంకర వరప్రసాద్ అంటే పెద్దగా ఎవరికి తెలియదు కానీ మెగాస్టార్ చిరంజీవి అంటే తెలియని వారు ఉండరు అంటే అతిశయోక్తి లేదు. ఆంధ్రప్రదేశ్లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరు గ్రామంలో కొణిదెల వెంకట్రావు, అంజనా దేవి లకు మొదటి సంతానంగా చిరంజీవి జన్మించాడు. చిన్నతనం నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో మద్రాస్ వచ్చి ఫిలిం ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ ఐ కెరీర్ మొదట్లోలో విలన్ గా క్యారెక్టర్ ఆర్టిస్టుగా నటిస్తూ ఆ తర్వాత స్టార్ హీరోగా తిరుగులేని స్టార్ డంను అందుకున్నాడు. అదేవిధంగా తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులేని స్థానాన్ని సొంతం చేసుకున్నాడు.
ఈ విషయం ఇలా ఉంచితే చిరంజీవి గురించి ఎప్పుడు ప్రస్తావన వచ్చిన మెగాస్టార్ అనే బిరుదుతో పిలుస్తూ ఉంటారు. అయితే ఇక్కడ చిరంజీవికి మెగాస్టార్ అనే బిరుదు ఎలా వచ్చింది..? ఎవరు ఇచ్చారు అన్న విషయాలు మాత్రం చాలా మందికి తెలియదు. మెగాస్టార్ కన్నా ముందు చిరంజీవిని అభిమానులు అందరూ సుప్రీం హీరో అని పిలుచుకునేవారు. చిరు నటించిన పాత సినిమాల్లో ఈ విషయాన్ని మనం గమనించవచ్చు. ఇదే సమయంలో టాలీవుడ్ సీనియర్ నిర్మాత కె ఎస్ రామారావు చిరంజీవికి మెగాస్టార్ అని బిరుదు ఇచ్చారు.
చిరంజీవి కేఎస్ రామారావు కాంబినేషన్లో వచ్చిన మొదటి సినిమా అభిలాష.. వీరి కాంబినేషన్ లో వచ్చిన తొలి సినిమా ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకుంది. ఆ తర్వాత వీరి కాంబినేషన్లో ఐదు సినిమాలకు పైగా వచ్చాయి. ఇక వాటిలో రాక్షసుడు, ఛాలెంజ్ వంటి ఎన్నో సినిమాలు ఉన్నాయి. ఆదే సమయంలో వీరి కాంబినేషన్లో నాలుగో సినిమాగా వచ్చిన మరణ మృదంగం సినిమా షూటింగ్ జరుగుతున్న సమయంలో వరుస విజయాలతో దూసుకుపోతున్న చిరంజీవికి సుప్రీం హీరో అనే బిరుదు సరిపోద్దని భావించిన నిర్మాత కే ఎస్ రామారావు.
ఆ సమయంలోనే బాగా ఆలోచించి చిరుకు మెగాస్టార్ అనే బిరుదును ఫిక్స్ చేశారు. ప్రముఖ రచయిత యండమూరి వీరేంద్రనాథ్ నవల ఆధారంగా ఆ సినిమా తెరకెక్కింది. మరణమృదంగంలో చిరు ఎంట్రీ సీన్‌లో మెగాస్టార్ చిరంజీవి అని టైటిల్ కార్డు పడుతుంది. ఆ సమయంలో సినిమా థియేటర్లు చప్పట్లు, కేరింతలతో మారుమ్రోగాయి. అలా మొదలైన మెగాస్టార్ బిరుదు ఇప్పుడు ఓ బ్రాండ్‌లా మారిపోయింది.