పాన్ ఇండియా స్టార్ హీరో, రెబల్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో నటించిన పౌరాణిక యాక్షన్ డ్రామా ఆదిపురుష్. బాహుబలి లాంటి పాన్ ఇండియా ఇమేజ్ తర్వాత ప్రభాస్ నటించిన సాహో, రాధేశ్యామ్ రెండు సినిమాలు అంచనాలు అందుకోలేదు. రాధేశ్యామ్ వచ్చి కూడా రెండేళ్లు దాటుతోంది. కాస్త లాంగ్ గ్యాప్ తీసుకున్న ప్రభాస్ ఎట్టకేలకు ఇప్పుడు ఆదిపురుష్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు.
రామాయణ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన ఈ యాక్షన్ డ్రామాకు బాలీవుడ్‌లో తానాజీ లాంటి సూపర్ హిట్ సినిమా తెరకెక్కించిన ఓం రౌత్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాలో ప్రభాస్ రాముడిగా జానకిగా బాలీవుడ్ ముద్దుగుమ్మ కృతిసనన్ నటించింది. ఇక బాలీవుడ్ స్టార్ విలన్ సైఫ్ ఆలీఖాన్ లంకేశ్‌గా రావణుడి పాత్రలో కనిపించాడు.
ఈ సినిమా జూన్ 16న వరల్డ్ వైడ్‌గా గ్రాండ్‌గా రిలీజ్ అవుతోన్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా సెన్సార్ కూడా కంప్లీట్ చేసుకుంది. సెన్సార్ బోర్డు వాళ్లు సినిమాకు క్లీన్ యు సర్టిపికెట్ ఇచ్చారు. రామాయణంలో యాక్షన్ సన్నివేశాలు ఉన్నా కూడా ఇతిహాస చరిత్ర కావడంతో పాటు అన్ని వర్గాల ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా తెరకెక్కించడంతో క్లీన్ యూ సర్టిఫికెట్ ఇచ్చినట్టు సమాచారం.
ఇక సినిమాకు అయితే సూపర్ హిట్ టాక్ అంటున్నారు. బాహుబలి తర్వాత ప్రభాస్ ఖాతాలో మంచి సినిమా పడిందని.. ఈ సినిమా తర్వాత నేషనల్ లెవల్లోనే కాకుండా ఇంటర్నేషనల్ వైడ్‌గా ప్రభాస్ క్రేజ్ ఎక్కడికో వెళ్లిపోవడం ఖాయం అంటున్నారు. అయితే సినిమా రన్ టైం మాత్రం ఏకంగా రెండు గంటల 59 నిమిషాల నిడివి కలిగి ఉంది.
అంటే 179 నిమిషాల భారీ రన్ టైం ఉంది. సినిమా ప్రేక్షకులకు కనెక్ట్ అయితే అసలు ఎంత రన్ టైం ఉన్నా ఎవ్వరికి ఇబ్బంది ఉండదు. బాహుబలి, సాహో సినిమాల రన్ టైం ఎంత ఎక్కువ అయినా ప్రేక్షకుడికి ఇబ్బంది లేదు. అదే రాధేశ్యామ్ రన్ టైం తక్కువుగా ఉన్నా ప్రేక్షకుడు కథతో కనెక్ట్ కాకపోవడంతో చూడలేకపోయాడు. రన్ టైం మినహా సినిమాకు అయితే బంపర్ టాక్ వచ్చేసింది. మరి రేపు థియేటర్లలో ప్రేక్షకులు ఎలా ? ఎంజాయ్ చేస్తారో ? చూడాలి.