ఇష్టం లేకపోయిన..మనసు చంపుకుని ..అన్నగారి కోసం అలాంటి పని చేసిన సావిత్రి..!!

వేశ్య పాత్ర‌లు.. దాసీ పాత్ర‌లు చేసేందుకు చాలా మంది ఇష్ట‌ప‌డేవారు కాదు. ముఖ్యంగా అగ్ర‌తార‌లుగా ఉన్న వారు.. ఈ పాత్ర‌లు వేసేందుకు ముందుకు వ‌చ్చేవారు కాదు. వీరిలో క‌న్నాంబ‌, ఎస్ వ‌ర‌ల‌క్ష్మి వంటి వారు.. చాలా మ‌డిగా ఉండేవారు. ఇక‌, సూర్యాకాంతం కూడా.. స‌మాజంలో కొంత వ్య‌తిరేక‌త ఉండే పాత్ర‌ల‌ను న‌టించేవారు కాదు. వ‌ద్దులేండి డైరెక్ట‌ర్‌గారూ.. ఇంకేదైనా పాత్ర ఉంటే చెప్పండి అని అనేవారు.

52 NTR ideas | new movie images, fall photo shoot outfits, new images hd

అలానే మ‌హానటి సావిత్రి కూడా వేశ్య‌, దేవ‌దాసీ పాత్ర‌ల‌ను చేయాలంటే.. ఇష్ట‌ప‌డేవారు కాదు. దీంతో చాలా అవ‌కాశాలు కోల్పోయార‌ని అంటారు. అయితే.. తెలుగులో కాదు.. త‌మిళంలో. ఇదిలావుంటే.. గుర‌జాడ అప్పారావు రాసిన కన్యాశుల్కం నాట‌కాన్ని సినిమాగా తీయాల‌ని భావించారు. దీనిలో వేశ్య పాత్ర‌కు ప్రాధాన్యం ఉంటుంది. అన్న‌గారు ఎన్టీఆర్‌, సావిత్రి న‌టించారు. మొత్తం క‌థ అంతా కూడా వేశ్య చుట్టూ తిరుగుతుంది.

HBD To Daring And Dashing Superstar Krishna | cinejosh.com

అదేస‌మ‌యంలో పూట‌కూళ్ల‌మ్మ పాత్ర‌కు ప్రాధాన్యం ఉంది. అయితే.. క‌థ బాగానే ఉన్నా..న‌టించేందుకు సావిత్రి ఒప్పుకోలేదు. దీనికి కార‌ణం.. ఆమె క‌న్యాశుల్కం నాటకంపై వ్య‌తిరేక‌త క‌లిగి ఉండ‌డ‌మే. ఈ విష‌యం తెలియ‌ని ద‌ర్శ‌కుడు.. ఆమె స్తానంలో ఇద్ద‌రు ముగ్గురు హీరోయిన్ల‌ను అడిగి చూశారు. బీ. స‌రోజా దేవి ఒప్పుకొన్నారు. కానీ, సావిత్రి అయితేనే బాగుంటుంద‌ని భావించి బాధ్య‌త‌ను అన్న‌గారిపై పెట్టారు.

Gudachari 116, Mosagallaku Mosagadu, And Others: Which Superstar Krishna Film Do You Want Mahesh Babu To Remake? | Telugu Filmnagar

 

దీంతో అన్న‌గారు ఏమండీ.. న‌టించ‌న‌ని చెప్పార‌ట‌ అని ప్ర‌శ్నించారు. అంతేకాదు.. ఆ పాత్ర‌కు చాలా ఔచిత్యం.. విరుపులు చాలా ఉన్నాయి. మీరైతేనే బాగుంటుంది. చివ‌రి సీన్ అదిరిపోతుంది. నా మాట విని..ఒప్పుకోండి.. అని చెప్ప‌గానే సావిత్రి అన్న‌గారి మాట కాద‌నలేక క‌న్యాశుల్కం సినిమాను ఒప్పుకొన్నా రు. అయితే.. ఈసినిమాలో అన్న‌గారి క‌న్నా.. సావిత్రికే ఎక్కువ‌గా పేరు వ‌చ్చింది.