ఈ హీరోయిన్ల భర్త‌లు ఏం చేసేవారో తెలిస్తే .. షాక్ అయిపోతారు..!!

ఓల్డ్ హీరోయిన్లు ఉద్యోగస్తుల భార్యలు అన్న విషయం చాలామందికి తెలియదు. చాలామంది హీరోయిన్లు తీసుకున్నట్లయితే వారి భర్తలు సినిమా రంగంలో ఉన్నారని అనుకుంటారు. సినిమా రంగంతో సంబంధం ఉన్న వారిని వివాహం చేసుకున్నారని ప్రేమించు చేసుకున్నారని భావిస్తారు. ఇది నిజమే సావిత్రి పెళ్లి చేసుకున్నటువంటి జెమినీ గణేషన్ సినిమారం గానికి చెందినటువంటి వ్యక్తి. అదే విధంగా భానుమతి చేసుకున్నటువంటి రామకృష్ణ ప్రముఖ దర్శకులు. అదేవిధంగా నిర్మాతగా కూడా రామకృష్ణ పేరు తెచ్చుకున్నారు.

Kalyanamalai Magazine - Serial story, Thiraichuvai - Potpourri of titbits  about Tamil cinema, Anjali Devi

ఇక అంజలీదేవి సంగీత దర్శకుడు ఆదినారాయణ రావు ని ప్రేమించే వివాహం చేసుకున్నారు. ఇక మహానటి అంజలీదేవి సంగీత దర్శకుడు ఆదినారాయణ రావ్ వివాహం చేస్తున్నారు. దీంతో సినిమా రంగంలో ఉన్న వాళ్ళందరూ కూడా ప్రేమించే వివాహాలు చేసుకుంటారు.. సినిమా రంగానికి చెందినటువంటి వారినే భర్తలుగా ఎంచుకుంటారు అనేటటువంటి మాట తరచుగా వినిపిస్తుంది. కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే ఓల్డ్ హీరోయిన్లను తీసుకుంటే చాలామంది ఉద్యోగస్తుల్ని పెళ్లి చేసుకున్నారు.

ఉదాహరణకు వాణిశ్రీ అనేక సినిమాల్లో శోభన్ బాబు అక్కినేని నాగేశ్వరరావు వంటి వారితో నటించింది. ప్రేమనగర్ వంటి సూపర్ హిట్ సినిమాలు వాణిశ్రీ ఖాతాలో ఉన్నాయి. అయితే, ఆవిడ ఇరిగేషన్ డిపార్ట్మెంట్లో సూపర్నెంట్ ఇంజనీర్ గా పని చేస్తున్న వ్య‌క్తిని వివాహం చేసుకున్నారు. అదేవిధంగా షావుకారు సినిమాతో అరంగేట్రం చేసి ఎన్టీ రామారావు సరసన అదే విధంగా అక్కినేని సరసన అనేక చిత్రాలు నటించినటువంటి జానకి కూడా ఒక ఉద్యోగస్తుడిని వివాహం చేసుకున్నారు.

Why actor-producer Devika Rani was truly the First Lady of Indian cinema |  Eye News,The Indian Express

ఆయన డిప్యూటీ కలెక్టర్‌గా తమిళనాడులోనే పనిచేసేవారు. వీరిది కూడా ప్రేమ వివాహ‌మేన‌ని చెబుతారు. అదే విధంగా బి సరోజ ఒకప్పుడు ఎన్టీ రామారావు సరసన హీరోయిన్గా నటించిన హీరోయిన్‌. అనేక చిత్రాల్లో సూపర్ హిట్ లు సాధించారు. అటువంటి ఆమె గవర్నమెంటుకు డిపార్ట్మెంట్ కి చెందిన ఆర్కిటెక్ట్ ఇంజనీర్ని ప్రేమించి పెళ్లి చేసుకున్నారంటే ఆశ్చర్యం కలిగిస్తుంది.

Sowcar Janaki | Veethi

దేవిక అనేక సినిమాల్లో అనేక పౌరాణిక సినిమాల్లో నటించిన దేవిక సైనికుడ్ని పెళ్లి చేసుకున్నారు. ఆర్మీకి చెందినటువంటి సైనికుడ్ని ఆవిడ వివాహం చేసుకున్నారు. అదే విధంగా కేఆర్ విజయ తెలుగు లో కూడా అనేక చిత్రాల్లో పౌరాణిక సినిమాల్లో లక్ష్మీ కటాక్షం వంటి సినిమాల్లో అన్నగారి సరసన‌ నటించారు. కే.ఆర్ విజయ కూడా ఒక వ్యాపారస్తుని వివాహం చేసుకున్నారు. ఇట్లా సినిమా రంగంలో ఉన్నటువంటి కొందరు హీరోయిన్లు ఉద్యోగస్తుల భార్యలుగా ఉండ‌డం గ‌మ‌నార్హం.

Actress KR Vijaya Family | Husband, Daughter | Biography & Lifestyle |  Unseen | ExtraZoom - YouTube